Malli Pelli: అఫీషియల్.. నరేశ్, పవిత్రల ‘మళ్లీ పెళ్లీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
సీనియర్ నటీనటులు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లీ. నరేశ్, పవిత్రల నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలను బేస్ చేసుకుని సీనియర్ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందు వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తి పెంచిన మళ్లీ పెళ్లీ సినిమా తీరా థియేటర్లలోకి రిలీజయ్యాక ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

సీనియర్ నటీనటులు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లీ. నరేశ్, పవిత్రల నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలను బేస్ చేసుకుని సీనియర్ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందు వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తి పెంచిన మళ్లీ పెళ్లీ తీరా థియేటర్లలోకి రిలీజయ్యాక ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మే 26న విడుదలైన ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందు గట్టిగా ప్రమోషన్లు చేయడం, నరేశ్, పవిత్రల రియల్ స్టోరీ అని చెప్పడంతో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఏ మాత్రం ఆకట్టుకుని మళ్లీ పెళ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.థియేటర్ రిలీజ్‌కు ముందే మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 2 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్లు సమాచారం.
ఈక్రమంలో ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు మళ్లీ పెళ్లీ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూన్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మళ్లీ పెళ్లీ సినిమాను విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా నిర్మించాడు. వనితా విజయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. కొన్ని రోజలు క్రితం కన్నుమూసిన శరత్ బాబు ఆఖరిసారిగా వెండితెరపై సందడి చేశారు. మరి థియేటర్లలో మళ్లీ పెళ్లీ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.




The story of the Boldest Couple is coming to your closest source of Entertainment ?#MALLIPELLI Premieres on @PrimeVideoIN on JUNE 23rd ??#MalliPelliOnPrime ?@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @sureshbobbili9 @VKMovies_ @adityamusic pic.twitter.com/AfFlyOhAfR
— MS Raju (@MSRajuOfficial) June 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..