Upasana: మరికొన్ని గంటల్లో తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌ చరణ్‌, ఉపాసన.. డెలివరీ కోసం అపోలో ఆస్పత్రికి మెగా కోడలు

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన మరికొన్ని గంటల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న ఉపాసన.. ప్రసవం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

Upasana: మరికొన్ని గంటల్లో తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌ చరణ్‌, ఉపాసన.. డెలివరీ కోసం అపోలో ఆస్పత్రికి మెగా కోడలు
Ramcharan
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 9:42 PM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన మరికొన్ని గంటల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న ఉపాసన.. ప్రసవం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఉపాసనకు మంగళవారం (జూన్‌ 20) డెలివరీ టైమ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఉపాసనను స్వయంగా వెంట తీసుకుని ఆస్పత్రికి వచ్చాడు రామ్‌ చరణ్‌. అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరూ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో వారసుడు/ వారసురాలు అడుగుపెట్టనున్నారా? అని ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు మెగా అభిమానులు కూడా ఈ శుభసందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులకు అంతా మంచే జరగాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కాగా రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద మంగళవారం మెగాభిమానులు పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టును షేర్‌ చేశారు.

‘కొణిదెల వారి ఇంట మూడో తరం రాకకు రేపే (మంగళవారం) శుభ ముహూర్తం. మెగా కుటుంబంలో బుడి.. బుడి.. అడుగులకు శ్రీకారం.. ఆ ‘చిరంజీవి’ చిరు చిరు మురిపాలకు ఇదే ఆరంభం. రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతుల బిడ్డకు దేవ దేవుళ్ల ఆశీర్వాదం అందాలి. అందుకు మంగళవారం ఉదయం సమీప దేవాలయాల్లో రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద ప్రత్యేక పూజలు, అర్చనలు చేయాలి’ అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈక్రమంలో అమ్మానాన్నలు కాబోతున్న చెర్రీ దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, నెటిజన్లు. కాగా పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా వారసుడు లేదా వారసురాలి కోసం ఆ కుటుంబంతోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజ్వల ఫౌండేషన్ ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఊయ్యల బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఉపాసన. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?