The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

హార్ట్‌ఎటాక్‌ బ్యూటీ 'ఆదాశర్మ' కీలక పాత్రలో నటించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది ది కేరళ స్టోరీ. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి సెన్సేషనే సృష్టించింది.

The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి 'ది కేరళ స్టోరీ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
The Kerala Story Ott
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 4:26 PM

హార్ట్‌ఎటాక్‌ బ్యూటీ ‘ఆదాశర్మ’ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది ది కేరళ స్టోరీ. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి సెన్సేషనే సృష్టించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రదర్శనపై అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలా మొత్తానికి ది కేరళ స్టోరీ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. అయితే అదాశర్మ సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ మూవీకి లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలా థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

థియేట్రికల్‌ రన్‌ ముగియడంతో జూన్‌ 23 నుంచి ది కేరళ స్టోరీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ది కేరళ స్టోరీ సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రాలు పోషించారు. మరి థియేటర్లలో ది కేరళ స్టోరీ సినిమాను మిస్‌ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?