AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Tashafi: జీ5 సరికొత్త సంచలనం.. యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’ ప్రారంభం..

ఇందులో సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌నివారం నుంచి ప్రారంభ‌మైంది.

Mission Tashafi: జీ5 సరికొత్త సంచలనం.. యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మిషన్ తషాఫి' ప్రారంభం..
Mission Tashafi
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2023 | 7:53 PM

Share

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ5. ప్రస్తుతం డిజిటల్ రంగంలో దూసుకెళ్తోన్న ఈ ఓటీటీ మాధ్యమం ఇప్పుడు స‌రికొత్త యాక్షన్ స్పై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సిద్ధమయ్యింది. ఈ సిరీస్‏కు ‘మిషన్ తషాఫి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాకుండా.. సినీరంగంలో ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌నివారం నుంచి ప్రారంభ‌మైంది.

మొత్తం8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే జీ5 ఓటీటీలో గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్య‌వ‌స్థ‌ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇందులో మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..