AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Muntashir: ‘ఆదిపురుష్’ సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ ఎవరు ?..  సినీ ప్రయాణం.. 

డైరెక్టర్ ఓంరౌత్ సైలెంట్ గా ఉండగా.. నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు మనోజ్ క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే.. ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ రాసింది ఈయనే. ఈ సినిమాలో హనుమంతుడు చెప్పే డైలాగ్ వివాదాస్పదమైంది. ఈ చిత్రంలో అసభ్యకరమైన పదాలను ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డైలాగ్స్ మార్చనున్నామని.. వారం రోజులలో సినిమాలో కొత్త డైలాగ్స్ జత చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇంతకీ ఈ మనోజ్ ముంతాషిర్ ఎవరు ?.. అతని ఫిల్మ్ కెరియర్ ఏంటీ అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Manoj Muntashir: 'ఆదిపురుష్' సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ ఎవరు ?..  సినీ ప్రయాణం.. 
Manoj Muntashir
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2023 | 3:20 PM

Share

మనోజ్ ముంతాషిర్.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోన్న పేరు. జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఈ మూవీ అద్భుతంగా ఉందని.. మరికొందరు డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ ఓంరౌత్ రామాయణాన్ని తెరకెక్కించడంలో అనేక పొరపాట్లు చేశాడంటూ ట్రోల్ చేస్తుండగా.. మనోజ్ ముంతాషిర్ నెట్టింట వివరణ ఇస్తున్నాడు. డైరెక్టర్ ఓంరౌత్ సైలెంట్ గా ఉండగా.. నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు మనోజ్ క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే.. ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ రాసింది ఈయనే. ఈ సినిమాలో హనుమంతుడు చెప్పే డైలాగ్ వివాదాస్పదమైంది. ఈ చిత్రంలో అసభ్యకరమైన పదాలను ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డైలాగ్స్ మార్చనున్నామని.. వారం రోజులలో సినిమాలో కొత్త డైలాగ్స్ జత చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇంతకీ ఈ మనోజ్ ముంతాషిర్ ఎవరు ?.. అతని ఫిల్మ్ కెరియర్ ఏంటీ అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

మనోజ్ ముంతాషిర్.. 1976 ఫిబ్రవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని గౌరీగంజ్‌లో జన్మించారు. అతని తండ్రి రైతు కాగా తల్లి ఉపాధ్యాయురాలు. మనోజ్ ముంతాషిర్ అసలు పేరు మనోజ్ శుక్లా.. ముంతాషిర్ అనేది అతని కలం పేరు. చిన్న వయస్సు నుంచే అతనికి పద్యాలు రాయడంపై ఆసక్తి ఉండేది. అతను ఎక్కువగా ముషాయిరాస్‌లో తన కవితలను చదివేవాడు. మొదట్లో అతను ప్రయాగ్‌రాజ్‌లోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. ఆ సమయంలో అతనికి రూ.135 మాత్రమే వచ్చేవి. అలహాబాద్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ముంబై వచ్చాడు. అతను మొదట భజన్ సామ్రాట్ అనూప్ జలోటాను కలిసి ఓ కవిత చెప్పగా.. రూ.3000 సంపాదించాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి కోసం ఓ సాంగ్ రాశాడు. 2014లో శ్రేయా ఘోషల్ కు పాడిన గజల్ ఆల్బమ్ హమాన్ షీన్ గుర్తింపు వచ్చింది. 2014లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఏక్ విలన్ చిత్రంలో తేరి గలియాన్ సాంగ్ రాశాడు. ఈ పాట పెద్ద హిట్ కావడమే కాకుండ్.. అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ పాటకు అతను చాలా అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ, కాబిల్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బాహుబలి (హిందీ), పికే, బేబీ, కపూర్ అండ్ సన్స్, రుస్తోమ్, కబీర్ సింగ్, రామ్ సేతు, విక్రమ్ వేద చిత్రాలకు సాంగ్స్ రాశాడు. బాహుబలి సినిమాకు మనోజ్ ముంతాషిర్ హిందీ డైలాగ్స్ రాశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు సైతం డైలాగ్స్ రాశారు మనోజ్ ముంతాషిర్.