Adipurush: ‘ఆదిపురుష్‌’ యూనిట్‌ సంచలన నిర్ణయం.. సినిమాలోని వివాదాస్పద డైలాగుల తొలగింపు

ఆదిపురుష్‌ మూవీ యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలోని వివాదాస్పద డైలాగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హిందూ సంఘాల అభ్యంతరం తెలపడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆదిపురుష్‌ మేకర్స్‌ వెల్లడించారు.

Adipurush: 'ఆదిపురుష్‌' యూనిట్‌ సంచలన నిర్ణయం.. సినిమాలోని వివాదాస్పద డైలాగుల తొలగింపు
Adipurush
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2023 | 1:43 PM

ఆదిపురుష్‌ మూవీ యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలోని వివాదాస్పద డైలాగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హిందూ సంఘాల అభ్యంతరం తెలపడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆదిపురుష్‌ మేకర్స్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదిపురుస్ రచయిత మనోజ్ ముంతశిర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. ‘ఆదిపురుష్ సినిమాలోని కొన్ని డైలాగులపై నేను ఎన్ని వివరణలు ఇచ్చానా అవి మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాయి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సంభాషణలను తీసేయాలని డిసైడ్ అయ్యాం. వాటి స్థానంలో కొత్త డైలాగ్స్ యాడ్ చేస్తున్నాం. వచ్చేవారం నుంచి ఇవి సినిమాలోకి అందుబాటులోకి వస్తాయి’ అని పేర్నొన్నారు ముంతశిర్.కాగా సినిమాలోని హనుమంతుడు, రావణాసురుడు డైలాగ్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో మంట పెడతారు. ఆ సమయంలో హనుమాన్‌ ఇంద్రజిత్తుతో.. ‘నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది.. దానికి రాసిన చమురు నీ బాబుది… నిప్పు కూడా నీ బాబుకే’ అంటూ ఓ డైలాగ్‌ చెబుతాడు. ఎంతోమందికి ఆరాధ్య దైవమైన ఆంజనేయుడి నోట ఇలాంటి మాస్ డైలాగులు రావడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్‌ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

కాగా ఆదిపురుష్  సినిమాలో అభ్యంతరమైన డైలాగ్స్‌ తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలయ్యింది. రాముడిని , హనుమంతుడిని అవమానించే రీతిలో ఈ సినిమాను తీశారని , ఆదిపురుష్‌ను బ్యాన్‌ చేసే ఆలోచనలో ఉందని తెలిపారు చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బాగేల్‌.ఇక శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఆదిపురుష్‌ డైలాగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఆదిపురుష్‌లో ఇలాంటి అసభ్యకరమైన డైలాగులు ఉపయోగించినందుకు చిత్రబృందం క్షమాఫణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో