AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా..

సినిమా స్క్రీన్ ఇప్పుడు దేవుళ్ల కథలను ప్రేక్షకులకు అందజేయడంలో బిజీగా ఉంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్.. ఇప్పుడు పురాణ గాథల వైపు ఊపు తిరిగింది. దేవుళ్లతో పాటు చరిత్ర మరిచిపోయిన వీరుల కథలను వెలికితీసి ప్రేక్షకులకు అందజేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చాలా రీసెర్చ్ చేస్తున్నారు.

మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా..
Mahaavatar Narasimha
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 8:39 AM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవ నడుస్తున్న విషయం తెలిసిందే.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే యానిమేషన్ సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో యానిమేషన్ సినిమాలు హడావిడి చేశాయి. హాలీవుడ్ లో చాలా యానిమేషన్స్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఇండియాలో తెరకెక్కిన యానిమేషన్ సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇటీవలే కన్నడలో విడుదలైన మహావతార్ నరసింహ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఎలాంటివి లేకుండా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది.

‘మ‌హావ‌తార్’ సినిమాటిక్ యూనివ‌ర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మ‌హావ‌తార్ నరసింహ రాగా త్వరలోనే మ‌హావ‌తార్ పరశురామ్ సినిమా రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు.. మ‌హావ‌తార్ నరసింహ సినిమాను బీట్ చేసే రేంజ్ లో మరో యానిమేటడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. లార్డ్‌ శివ నేపథ్యంలో ‘పినాకిన్‌’ అనే యానిమేషన్‌ చిత్రం రూపొందుతోంది.

కమల్‌భారతి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హర్ష్  పండిట్, వామన్‌ రాణే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్‌ అంచాలియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా పినాకిన్‌ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఈమేరకు ఆసక్తికర పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను ఈ ఏడాదే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా తెలిపారు మేకర్స్. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే శివ్‌ సతీ అనే మరో యానిమేషన్‌ సినిమాను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పక్కా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!