AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్వంటీ20 వరల్డ్ కప్: ఆ టాప్ టీమ్స్‌కు నో ఛాన్స్.. T20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్టులు వీరే.. గ్రోక్ షాకింగ్ జోస్యం

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కీలకమైన సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెమీస్ లెక్కలు తేల్చే ఈ మ్యాచ్ లపై రకరకాలుగా అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు. ఈ క్రమంలో తాజాగా ఏఐ గ్రోక్ కూడా సెమీస్ బెర్తులపై షాకింగ్ జోస్యం చెప్పింది.

ట్వంటీ20 వరల్డ్ కప్: ఆ టాప్ టీమ్స్‌కు నో ఛాన్స్.. T20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్టులు వీరే.. గ్రోక్ షాకింగ్ జోస్యం
T20 World Cup 2026
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 9:31 AM

Share

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ కు చేరుకుంది. సూపర్ 8 గ్రూప్ ఏ-లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-బీలో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. సూపర్ 8 రౌండ్ లో భాగంగా శనివారం (ఫిబ్రవరి21)న పాకిస్తాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 22), ఇంగ్లండ్, శ్రీలంక జట్లు అమీ తుమీ తేల్చుకోనుండగా, మరో మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇలా సూపర్ 8 స్టేజ్ లో ఉన్న రెండు గ్రూపుల్లో టాప్ 2గా నిలిచిన నాలుగు జట్లకు సెమీస్ బెర్తులు ఖరారవుతాయి. ఈ క్రమంలో సెమీస్ బెర్తులపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తున్నారు. ఏయే జట్లు నాకౌట్ స్టేజ్ కు చేరుకుంటాయోనని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ గ్రోక్ కూడా తన అంచనాలను చెప్పేసింది.

టీ 20 ప్రపంచకప్ లో సెమీస్ కు ఏయే జట్లు చేరతాయన్న దానిపై గ్రోక్ ను ఎక్స్ లో ఓ యూజర్ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన గ్రోక్.. షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. సూపర్ 8లో గ్రూప్ ఏ నుంచి భారత్, వెస్టిండీస్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయని చెప్పిన గ్రోక్.. గ్రూప్ బీ నుంచి పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయట. ఓవరాల్ గా భారత్, విండీస్, పాకిస్తాన్, ఇంగ్లండ్ నాకౌట్ రేసుకు చేరుకుంటాయని గ్రోక్ అంచనా వేసింది. అయితే ఇందులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పేరు లేకుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ పేరు ఉండటంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే పాకిస్తాన్ ఎందుకు సెమీస్ చేరుతుందో ఏఐ గ్రోక్ ఒక విశ్లేషణ కూడా ఇచ్చింది. పాకిస్తాన్ పేస్ అటాక్ బాగుందని, బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ కూడా సూపర్బ్ గా ఉందని గ్రోక్ అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆసీస్ పై తాజాగా పాకిస్తాన్ సాధించిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ ను కూడా ఏఐ గ్రోక్ గుర్తు చేసింది. మరి ఈ అంచనాలు నిజమవుతాయో? లేదో? చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆ టాప్ టీమ్స్ కు నో ఛాన్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us