ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..! సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఇతను ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోలు దర్శకులుగా, దర్శకులు హీరోలుగా మారిపోతున్నారు. హీరోలు చాలా మంది దర్శకులుగా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఓ దర్శకుడు హీరోగా చేసి ఆతర్వాత డైరెక్టర్ అయ్యి సక్సెస్ అయ్యాడు. ఈ ఫొటోలో ఉన్న దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్ట్ లు మాత్రమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత దర్శకులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోలుగా మారి సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. కాగా పైన కనిపిస్తున్న దర్శకుడిని గుర్తుపట్టారా.? బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మారక ముందు ఇలా హీరోగా సినిమాలు కూడా చేశాడు. ఒకప్పుడు హీరోగా చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.
ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయనను ఈజీగా గుర్తుపట్టేయ్యొచ్చు.. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు ఆ దర్శకుడు. ఇంతకూ అతను ఎవరంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్నసినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలన్నీ భారీ హిట్స్ అందుకుంటున్నాయి. కొంతమంది దర్శకులు బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నారు. అలాగే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ సైలెంట్ గా హిట్స్ కొడుతున్నాడు. ఆయన ఎవరో కాదు యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ కుర్ర దర్శకుడు హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. జ్ఞాపకం, స్నేహగీతం లాంటి సినిమాల్లో నటించాడు.
ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
పై ఫోటో స్నేహగీతం సినిమాలోనిదే.. ఆతర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత సినిమాలకు మాటలు కూడా రాశాడు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే ధనుష్ హీరోగా సార్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై సక్సెస్ సాధించింది. ఆతర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
View this post on Instagram
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




