Sudhakar: నా కుమారుడికి చిరంజీవి అండదండలున్నాయి.. మెగాస్టార్‌ చేతుల మీదుగానే మా అబ్బాయి తెరంగేట్రం: సుధాకర్‌

గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి పూర్తికి దూరంగా ఉన్నారు ప్రముఖ సీనియర్‌ కమెడియన్‌ సుధాకర్‌. వయసు పైబడడం, దీనికి తోడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా లైమ్‌లైట్‌లోనే ఉండిపోయారాయన. అయితే ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Sudhakar: నా కుమారుడికి చిరంజీవి అండదండలున్నాయి.. మెగాస్టార్‌ చేతుల మీదుగానే మా అబ్బాయి తెరంగేట్రం: సుధాకర్‌
Sudhakar, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jun 20, 2023 | 6:07 PM

గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి పూర్తికి దూరంగా ఉన్నారు ప్రముఖ సీనియర్‌ కమెడియన్‌ సుధాకర్‌. వయసు పైబడడం, దీనికి తోడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా లైమ్‌లైట్‌లోనే ఉండిపోయారాయన. అయితే ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఆయనే అందరిముందుకొచ్చి ‘నేను బతికున్నాను మొర్రో’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా ఫాదర్స్‌ డే సందర్భంగా ఇటీవల ఓ ఛానెల్‌ నిర్వహించిన స్పెషల్‌ ప్రోగ్రాంలో సందడి చేశారు సుధాకర్‌. అలాగే తన కుమారుడు బెనెడిక్ మైఖేల్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన వారసుడు బెనెడిక్ మైఖేల్‌ సినీ అరంగేట్రం, మెగాస్టార్‌ చిరంజీవితో అనుబంధం గురించి సుధాకర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

కాగా చిరంజీవి- సుధాకర్‌ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈక్రమంలో చిరంజీవితో అనుబంధంపై స్పందించిన సుధాకర్‌.. ‘చిరంజీవి నా మిత్రుడు.. శ్రేయోభిలాభి. మా అబ్బాయి (బెనెడిక్ మైఖేల్‌) గురించి ఇప్పుడే చెప్పకూడదు. కానీ చిరంజీవి చేతుల మీదుగానే మా వారసుడి తెరంగేట్రం జరుగుతుంది. గతంలో బెన్నీ కాలేజీ సీటు విషయంలో చిరంజీవి చాలా హెల్ప్‌ చేశారు. ఇప్పుడు తన సినిమా కెరీర్ విషయంలో కూడా చిరంజీవే చూసుకుంటారు’ అని చెప్పుకొచ్చారు సుధాకర్‌. ఈ క్రమంలో సుధాకర్‌ కుమారుడికి చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే