Adipurush: మరోసారి ‘ఆదిపురుష్’ రైటర్ షాకింగ్ కామెంట్స్.. హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ..

ఇప్పటికే రావణుడి పాత్ర కాస్ట్యూమ్స్ పై, హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆంజనేయుడు మాస్ డైలాగ్స్ చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసున్నారు సినీప్రియులు. దీంతో ఈ సినిమాలోని అభ్యంతరక డైలాగ్స్ మార్చి కొత్త సంభాషణలను యాడ్ చేస్తామని చిత్రయూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమాపై పై వివాదాలు మాత్రం ఆగడం లేదు.

Adipurush: మరోసారి 'ఆదిపురుష్' రైటర్ షాకింగ్ కామెంట్స్.. హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ..
Manoj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2023 | 5:27 PM

ఆదిపురుష్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ అవుతున్న పేరు. బాక్సాఫీస్ వద్ద ఓవైపు భారీగా వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా.. అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే రావణుడి పాత్ర కాస్ట్యూమ్స్ పై, హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆంజనేయుడు మాస్ డైలాగ్స్ చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసున్నారు సినీప్రియులు. దీంతో ఈ సినిమాలోని అభ్యంతరక డైలాగ్స్ మార్చి కొత్త సంభాషణలను యాడ్ చేస్తామని చిత్రయూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమాపై పై వివాదాలు మాత్రం ఆగడం లేదు. రామయాణాన్ని మరోసారి వెండితెరపై అద్భుతంగా చూపిస్తారనుకుంటే.. వాల్కీకి రాసిన రామయాణాన్నే మార్చేశారని తిట్టిపోస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే ఆదిపురుష్ చుట్టూ వివాదాలు నెలకొనగా.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు రైటర్ మనోజ్ ముంతాషిర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హనుమంతుడు అసలు దేవుడే కాదని.. కేవలం భక్తుడు మాత్రమే అని అన్నారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ మాట్లాడుతూ.. “హనుమంతుడు శ్రీరాముడిలాగా మాట్లాడరు. తాత్వికంగా మాట్లాడరు. ఆయన అసలు భగవంతుడు కాదు. కేవలం భక్తుడు. రాముడికి హనుమంతుడు వీరభక్తుడు. అంతేకానీ దేవుడు కాదు. ఆయన భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయనను మనం దేవుడిని చేశాం” అని అన్నారు. ఆదిపురుష్ సినిమాలో హనుమ డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్ధించుకున్నాడు. దీంతో మనోజ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ వసూళ్లు భారీగానే ఉన్నాయి. మొదటిరోజే రూ.140 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు 200 కోట్లు వసూలు చేసింది. ఇక మొదటి వారాంతంలోనే ఈ సినిమా రూ.300 కోట్లు మార్క్ కు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే నాలుగో రోజు ఆదిపురుష్ కలెక్షన్స్ తగ్గాయి. కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసి.. మొత్తం రూ.375 కోట్లకు చేరుకుంది. ఇక ఐదో రోజు రూ. 400 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!