Lokesh Kanagaraj: పది సినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తానంటున్న డైరెక్టర్.. ఎందుకంటే..

ఇప్పటికే దళపతి విజయ్ తో మాస్టర్, కార్తీతో ఖైదీ చిత్రాలను తెరకెక్కించి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇటీవల లోకనాయకుడు కమల్ హాసన్‏తో విక్రమ్ సినిమాను రూపొందించి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా... ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూర్య, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Lokesh Kanagaraj: పది సినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తానంటున్న డైరెక్టర్.. ఎందుకంటే..
Lokesh Kanagaraj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2023 | 3:19 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్స్‏లో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఇప్పటివరకు అతను తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నాయి. దీంతో స్టార్ హీరోస్ అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే దళపతి విజయ్ తో మాస్టర్, కార్తీతో ఖైదీ చిత్రాలను తెరకెక్కించి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇటీవల లోకనాయకుడు కమల్ హాసన్‏తో విక్రమ్ సినిమాను రూపొందించి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా… ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూర్య, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు పది సినిమాలు చేసి తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు.

“నాకు దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. ఇండస్ట్రీలో నేను ఎక్కువ రోజులు ఉండాలని కోరుకోవడం లేదు. నేను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేను చేయాలనుకున్నదాని కోసం ప్రయత్నించడం మాత్రమే తెలుసు. అందుకే షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నేను పది సినిమాలు చేస్తాను. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా పని పట్ల నమ్మకం ఉన్నందుకు నిర్మాతలు, నటీనటులకు కృతజ్ఞతలు. ఇక్కడ చాలా సంక్లిష్టత ఉంది. ఎంతో బాధ్యతాయుతంగా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇక లియో సినిమా విషయానికి వస్తే నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాము. విజయ్ దళపతితో సినిమా చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది” అని అన్నారు. లియో చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్