Kajal Aggarwal: కాఫీలో స్విమ్మింగ్ చేసిన కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్..
కాజల్ 60వ చిత్రం లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇందులో కాజల్ మేకోవర్, యాటిట్యూడ్ చాలా బాగున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం వరుస చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన కాజల్.. ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె నందమూరి హీరో బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవలే కాజల్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అలాగే కమల్ హసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రంలోనూ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలో అటు సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ అయ్యింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా కాజల్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతుంది.
అందులో ఓ కాఫీ కప్పు ముందు పెట్టి ఏకంగా అందులో దూకేసింది. ఆ తర్వాత కాఫీలోనే స్విమ్మింగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. కాజల్ క్రియేటివిటి చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అదేలా సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ..”దృఢ నిశ్చయం, కాఫీ లోస్ కాదు.. ప్రేమతోనే కాఫీ కప్పులోకి దూకేస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.




ఇదిలా ఉంటే.. కాజల్ 60వ చిత్రం లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇందులో కాజల్ మేకోవర్, యాటిట్యూడ్ చాలా బాగున్నాయి.
Diving into this day with Conviction, Love and coffee…… loads of coffee , no, loads of love ???☕ pic.twitter.com/xUCVc2wRvO
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.