Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాకు ముందుగా అనుకున్నది ప్రభాస్‏ను కాదు.. ఆ బాలీవుడ్ హీరో చేయాల్సిందట..

ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలో డైరెక్టర్ ఓంరౌత్ ఎన్నో తప్పులు చేశారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్ నటన మాత్రం అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Adipurush: 'ఆదిపురుష్' సినిమాకు ముందుగా అనుకున్నది ప్రభాస్‏ను కాదు.. ఆ బాలీవుడ్ హీరో చేయాల్సిందట..
Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2023 | 6:34 PM

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.300 కోట్లు మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ మరిన్ని రోజుల్లో సులభంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో ఈ సినిమా విమర్శలను సైతం ఎదుర్కొంటుంది. ఓవైపు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుండగా.. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలో డైరెక్టర్ ఓంరౌత్ ఎన్నో తప్పులు చేశారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్ నటన మాత్రం అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ మూవీ కోసం డైరెక్టర్ ఓంరౌత్ ముందుగా అనుకున్నది ప్రభాస్ ను కాదట. యంగ్ రెబల్ స్టార్ ను సంప్రదించకముందు ఈ సినిమాలో రాఘవుడిగా నటించేందుకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అనుకున్నారట. తానాజీ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలో ఓంరౌత్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలో అతను హృతిక్ రోషన్ తో ఆదిపురుష్ సినిమాను హృతిక్ తో చేయాలనుకున్నారట. అయితే ఈ సినిమాకు హృతిక్ నో చెప్పడంతో ప్రభాస్ ను ఎంపిక చేశారట.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ సినిమాలో సీతాదేవి పాత్రకు కృతి సనన్ సైతం ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా అనుష్క శర్మ, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కియారా అద్వానీ పేర్లు పరిశీలించబడ్డాయి. కీర్తి సురేష్ పేరు దాదాపు ఖరారు అయ్యిందట.. కానీ అప్పటికే కీర్తి వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ఆపర్ రిజెక్ట్ చేసిందట. చివరగా ఈ సినిమాకు కృతి సనన్ ఫైనల్ అయ్యింది.