AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: సలార్ సినిమాకు కేజీఎఫ్ కనెక్షన్.. కొత్త పోస్టర్‎తో క్లారిటీ ఇచ్చినట్టేనా ?..

ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో డార్లింగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇక గతంలో ఈ మూవీ సెట్స్ నుంచి వచ్చిన ఫోటోస్ హైప్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Salaar: సలార్ సినిమాకు కేజీఎఫ్ కనెక్షన్.. కొత్త పోస్టర్‎తో క్లారిటీ ఇచ్చినట్టేనా ?..
Salaar
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2023 | 7:16 PM

Share

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అభిమానులను నిరాశపరచగా.. ఇక ఇటీవల విడుదైలన ఆదిపురుష్ మాత్రం విమర్శలు మాత్రం ఎదుర్కొంటుంది. ఇందులు ప్రభాస్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ… డైరెక్టర్ ఓంరౌత్ చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈసినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో డార్లింగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇక గతంలో ఈ మూవీ సెట్స్ నుంచి వచ్చిన ఫోటోస్ హైప్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా 100రోజులే సమయం ఉందని చెబుతూ మేకర్స్ ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రపంచానికి సీపీఆర్ పెట్టాల్సిన టైమ్ వచ్చిందంటూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఈ క్రమంలోనే మరోసారి కేజీఎఫ్ మూవీ కనెక్షన్ తెరపైకి వచ్చింది. అదే ఎలాగా అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‏లో కొన్ని బాక్సులు కనిపించాయి. నిజానికి పోస్టర్ డార్క్ గా ఉండగా.. కాస్త బ్రైట్ నెస్ పెంచి చూస్తే అందులోని బాక్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సలార్ సినిమాకు.. కేజీఎఫ్ చిత్రానికి కనెక్షన్ ఉందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సలార్ పోస్టర్ లో బాక్సులు కనిపించడంతో కేజీఎఫ్ సినిమాతో కనెక్షన్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.