Rakesh Master: రాకేష్‌ మాస్టర్‌ మాకెప్పుడూ గురువే.. ఆయన ఫ్యామిలీకి అండగా ఉంటాం: గణేష్‌ మాస్టర్‌

రాకేష్‌ మాస్టర్‌ హఠాన్మరణంతో ఆయన కుటుంబం రోడ్డున పడినట్లయింది. ఆయన ఫ్యామిలీని ఆదుకోవాలని చాలామంది కోరుతున్నారు. ఈక్రమంలో గణేష్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. రాకేష్‌ మాస్టర్‌ ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Rakesh Master: రాకేష్‌ మాస్టర్‌ మాకెప్పుడూ గురువే.. ఆయన ఫ్యామిలీకి అండగా ఉంటాం: గణేష్‌ మాస్టర్‌
Rakesh Master
Follow us

|

Updated on: Jun 20, 2023 | 4:18 PM

టాలీవుడ్‌ కొరియాగ్రాఫర్‌, ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రాకేష్‌ మాస్టర్‌ అనారోగ్యంతో కన్నుమూయడం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. సుమారు 1500 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ అందించిన ఆయన మరణవార్తను ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన రాకేష్‌ మాస్టర్‌ ఆదివారం (జూన్‌ 18) సాయంత్రం కన్నుమూశారు. ఇక సోమవారం (జూన్‌ 19) కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య మాస్టర్‌ అంత్యక్రియలు ముగిశాయి. రాకేష్‌ మాస్టర్‌ శిష్యులు శేఖర్ మాస్టర్‌, జానీ మాస్టర్‌ గురువు పాడె మోయగా, కుమారుడు చరణ్‌ తండ్రి కర్మకాండలు నిర్వహించాడు. కాగా రాకేష్‌ మాస్టర్‌ హఠాన్మరణంతో ఆయన కుటుంబం రోడ్డున పడినట్లయింది. ఆయన ఫ్యామిలీని ఆదుకోవాలని చాలామంది కోరుతున్నారు. ఈక్రమంలో గణేష్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. రాకేష్‌ మాస్టర్‌ ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

‘టాలీవుడ్‌ డ్యాన్స్‌ ఇండస్ట్రీకి, మాకు రాకేష్‌ మాస్టరే పెద్ద దిక్కు. ఆయన ఎక్కడున్నా, ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ సహాయం చేసేవారు. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించారు. మేం మాస్టర్‌తో తో కలిసి పని చేసినా, చేయకపోయినా డ్యాన్స్‌ పరంగా ఆయన మాకెప్పుడూ గురువే. ఆయన తన శిష్యులకు డ్యాన్స్‌ నేర్పించి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడూ వాళ్లందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరం కలిసి ఆయన ఫ్యామిలీకి అండగా నిలబడతాం. ఈ విషయంపై డ్యాన్స్‌ మాస్టర్లు అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటాం. అలాగే యూనియన్‌తో కలిసి తప్పకుండా రాకేష్‌ మాస్టర్‌ ఫ్యామిలీకి తగిన సహాయం చేస్తాం ‘అని గణేష్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి