AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: అలా చేసినందుకు ప్రభాస్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. ఆదిపురుష్‌పై సుమన్‌ ఇంకా ఏమన్నారంటే?

సీనియర్‌ నటుడు సుమన్‌ ఆదిపురుష్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. నాగార్జున- రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీరామదాసు' సినిమాలో సుమన్‌ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. తాజాగా ఆదిపురుష్‌పై స్పందించిన ఆయన..

Adipurush: అలా చేసినందుకు ప్రభాస్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. ఆదిపురుష్‌పై సుమన్‌ ఇంకా ఏమన్నారంటే?
Suman On Adipurush Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2023 | 1:29 PM

Share

ప్రభాస్‌ రాముడి అవతారంలో కనిపించిన ఆదిపురుష్‌ సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ క్రమంగా స్లో అవుతోంది. వసూళ్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్‌ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. చాలా చోట్ల సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో సీనియర్‌ నటుడు సుమన్‌ ఆదిపురుష్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. నాగార్జున- రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్‌ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. తాజాగా ఆదిపురుష్‌పై స్పందించిన ఆయన.. ‘ రావణాసురుడు సీతను అపహరించడం నుంచి రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్‌ తీశారు. ఇక మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో రాముడికి మీసాలు, గడ్డాలు ఉండవు. అయితే ఇందులో  ఆదిపురుష్ లో రాముడిని సాధారణంగా చూపించి చాలా పెద్ద రిస్క్‌ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ను మెచ్చుకోవచ్చు. సుమారు రెండున్నరేళ్లపాటు ఆ బాడీని మెయింటైన్‌ చేయడం చిన్న విషయమేమీ కాదు. అందుకు ప్రభాస్‌ను మెచ్చుకోవాల్సిందే’

‘ఇక ఆదిపురుష్‌ సినిమాలో డైరెక్టర్‌ చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. రావణుడి వేషధారణ మార్చడం చాలా తప్పు. ఇక గ్రాఫిక్స్‌ విషయానికొస్తే.. కొన్ని చోట్ల అద్భుతంగా ఉంటే మరికొన్ని చోట్ల పాత దానిలా ఉన్నాయి. జానకిగా కృతిసనన్‌ బాగా చేసింది. అయితే సినిమాలో చాలా వరకు ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. ఆదిపురుష్‌ అనేది ఒక పవర్‌ఫుల్‌ టైటిల్‌. అయితే సినిమా చూసి చాలా నిరాశ చెందాను. ఇలాంటి సినిమాలను దక్షిణాది వాళ్లే బాగా హ్యాండిల్‌ చేస్తారు’ అని సుమన్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.. 

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా