Tollywood:’ఒంటికి యోగా మంచిదేగా’ అంటూ శరీరాన్ని విల్లులా వంచేసిన యంగ్ హీరో సతీమణి.. ఎవరో గుర్తుపట్టారా ?

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు సామాన్యుల వరకు యోగాసనాలు వేశారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దీని ప్రాముఖ్యతను వివరిస్తూ తమ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలన్నింటినీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. యోగాను లైఫ్‌ స్టైల్‌లో భాగం చేసుకోవాలని తమ అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లకు సందేశమిచ్చారు

Tollywood:'ఒంటికి యోగా మంచిదేగా' అంటూ శరీరాన్ని విల్లులా వంచేసిన యంగ్ హీరో సతీమణి.. ఎవరో గుర్తుపట్టారా ?
Tollywood Celebrity
Follow us
Basha Shek

|

Updated on: Jun 23, 2023 | 9:46 PM

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు సామాన్యుల వరకు యోగాసనాలు వేశారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దీని ప్రాముఖ్యతను వివరిస్తూ తమ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలన్నింటినీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. యోగాను లైఫ్‌ స్టైల్‌లో భాగం చేసుకోవాలని తమ అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లకు సందేశమిచ్చారు. అలా సినిమా తారల యోగా స్టిల్స్‌ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇందులో యోగాసనం వేసినది ఓ పెద్దింటి కోడలు . ఓ యంగ్‌ హీరో సతీమణి. ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తిన్న వీరిద్దరూ రెండో సారి వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? యస్‌… పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు మంచు మనోజ్‌ సతీమణి మంచు మౌనిక. యోగాడే సందర్భంగా మౌనిక కూడా యోగాసనాలు చేసింది. అది కూడా ఎంతో కష్టతరమైనవి. అలాగే 108 నమస్కారాలు కూడా చేసింది. ఈ విషయాన్ని మౌనిక భర్త మనోజ్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

‘మై వైఫ్‌ మౌనిక’ అంటూ మనోజ్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆరోగ్యం పట్ట మౌనికకు ఉన్న స్పృహ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా కొద్ది నెలల క్రితమే మంచు మనోజ్‌తో కలసి ఏడడుగులు నడిచింది మౌనిక. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్‌ గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వాటి ది ఫిష్‌ సినిమాలో నటిస్తున్నాడు మనోజ్‌.

ఇవి కూడా చదవండి
Manchu Manoj Post

Manchu Manoj Post

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.