Vishnupriya: మూడేళ్ల వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైన విష్ణుప్రియ.. తల్లి మరణంతో మళ్లీ..

ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతున్న చాలామంది ఎన్నో కష్టాలను దాటి ఇండస్ట్రీలోకి వచ్చినవారే. పేదరికం, ఆర్థికం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ను అధిగమించి పాపులారిటీ తెచ్చుకున్న వారే. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా క్రేజ్‌ తెచ్చుకున్న విష్ణుప్రియ కూడా ఈ కోవకే చెందుతుంది.

Vishnupriya: మూడేళ్ల వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైన విష్ణుప్రియ.. తల్లి మరణంతో మళ్లీ..
Actress Vishnupriya
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 5:58 PM

సాధారణంగా సినిమా తారల జీవితమంటే కలర్‌ ఫుల్‌గా ఉంటుందనుకుంటారు చాలామంది. కోట్లలో రెమ్యునరేషన్లు, లగ్జరీ విల్లాలు, కార్లు.. ఇలా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయనుకుంటారు. వారికి కష్టమనేదే తెలియదనుకుంటారు. ఇది కొంత వరకు నిజమే అయినా అందరి జీవితాలు మాత్రం ఇలాగే ఉండవు. ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతున్న చాలామంది ఎన్నో కష్టాలను దాటి ఇండస్ట్రీలోకి వచ్చినవారే. పేదరికం, ఆర్థికం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ను అధిగమించి పాపులారిటీ తెచ్చుకున్న వారే. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా క్రేజ్‌ తెచ్చుకున్న విష్ణుప్రియ కూడా ఈ కోవకే చెందుతుంది. న్యూస్‌ జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత యూట్యూబర్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆతర్వాత సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. దీని తర్వాత పలు టీవీషోస్‌, ప్రోగ్రాముల్లో కనిపించిన విష్ణుప్రియ కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై మంచి అవకాశాలు తెచ్చుకుంటోంది విష్ణుప్రియ. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. ఆమె ఇక్కడ వరకు చేరుకోవడానికి ముందు ఎన్నో కష్టాలు పడింది. పలు సందర్భాల్లో విష్ణుప్రియనే తను పడిన కష్టాలను చెప్పుకొచ్చింది.

కాగా విష్ణుప్రియ మూడేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆతర్వాత తన తల్లి దగ్గరే పెరిగి, పెద్దదైంది విష్ణుప్రియ. అయితే తండ్రి మాత్రం రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా విష్ణుప్రియను పెంచి పెద్ద చేసిన తల్లి కూడా ఇటీవలే కన్నుమూసింది. దీంతో విష్ణుప్రియ ఒంటరిగా మిగిలిపోయింది. అయితే తాజాగా తన తండ్రి చెంతకు చేరింది విష్ణుప్రియ. ఫాదర్స్‌డే సందర్భంగా ఓ ఛానెల్‌లో నిర్వహించిన స్పెషల్‌ ప్రోగ్రాంలో సందడి చేసింది విష్ణుప్రియ. ఈ సందర్భంగానే మూడేళ్ల వయసులో మిస్‌ అయిన నాన్న ప్రేమను మళ్లీ పొందుతున్నానంటూ ఎమోషనలైంది. ‘నాకు మూడేళ్ల వయసులోనే అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. ఇప్పుడు అమ్మ నా దగ్గర లేదు. అయితే నాన్న ప్రేమను పొందుతున్నాను. దీనిని నేను అదృష్టంగా భావిస్తున్నా. మా పేరెంట్స్‌ విడిపోయినందుకు నేను చాలా మిస్‌ అయ్యాను. చాలా సార్లు వారిని తిట్టుకున్నాను. అయితే నాలా మీరు కూడా పేరెంట్స్‌ను తిడుతుంటే మాత్రం దయచేసి అలా చేయద్దు. వాళ్లు ఎందుకు అలా చేశారో అర్థం చేసుకునేందుకు ట్రై చయండి. ఏది జరిగినా మన మంచి కోసమే. మూడేళ్ల వయసులో నాన్న ప్రేమను మిస్‌ అయ్యాను. నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు నాకు తమ్ముడు, చెల్లెలు (సవతి తల్లి పిల్లలు) కూడా ఉన్నారు. నాన్న ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌ ఇది’ అని ఎమోషనలైంది విష్ణుప్రియ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?