Vijaya Shanthi: విజయశాంతితో ఉన్న ఈ క్యూట్‌ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరో..

ఇవాళ (జూన్‌ 24) విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన అరుదైన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో విజయశాంతితో కలిసి ఉన్న పిల్లాడిని గుర్తుపట్టారా?

Vijaya Shanthi: విజయశాంతితో ఉన్న ఈ క్యూట్‌ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరో..
Vijayashanthi
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 7:45 PM

విజయశాంతి.. అప్పట్లో స్టార్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే ఓసేయ్‌ రాములమ్మ, రౌడీ దర్బార్‌, కర్తవ్యం లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసిన ఘనత ఆమె సొంతం. అందుకే సినిమా ఇండస్ట్రీలోఆమెకు లేడీ అమితాబ్‌ అనే పేరుంది. ఇవాళ (జూన్‌ 24) విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన అరుదైన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో విజయశాంతితో కలిసి ఉన్న పిల్లాడిని గుర్తుపట్టారా? ప్రస్తుతం అతను టాలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరో. పాన్‌ ఇండియా కాదే ఏకంగా గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవలే తండ్రిగా కూడా ప్రమోషన్‌ పొందాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్‌. ఆ పిల్లాడు మరెవరో కాదు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా సెట్‌లో తీసిన ఫొటో ఇది.

కాగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో పలు సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ జోడీగా వీరికి పేరుంది. అయితే ఏమైందో తెలియదు కానీ గ్యాంగ్‌ లీడర్‌ సినిమా తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక మహేశ్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించింది. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ వారిద్దరని ఒకే ఫ్రేములో చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటున్నారు విజయశాంతి. మరోవైపు చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..