IB71 OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ .. ‘ఐబీ71’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటించిన మరో చిత్రం ఐబీ 71. ఘాజీ, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంకల్ప్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతల్లో...

IB71 OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ .. 'ఐబీ71' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Ib 71 Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 8:23 PM

ఎన్టీఆర్‌ నటించిన శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో పవర్‌ ఫుల్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు విద్యుత్‌ జమ్వాల్‌. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కమాండో సిరీస్‌, జంగ్లీ, ఖుదా హఫీజ్‌ సినిమాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటించిన మరో చిత్రం ఐబీ 71. ఘాజీ, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంకల్ప్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా పాలు పంచుకున్నాడు విద్యుత్‌ జమ్వాల్‌. 1971లో ఇండియన్ ఏజెంట్స్, పాకిస్తాన్ లోకి వెళ్లి చేసిన ఒక మిషన్ ఆధారంగా రూపొందించిన ఈ స్పై థ్రిల్లర్‌ మే 12న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్‌ రివ్యూలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐబీ 71 ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ విద్యుత్‌ జమ్వాల్‌ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

ఈక్రమంలో జులై 7వ తేదీ నుంచి ఐబీ 71ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తెలిపింది. కాగా ఈ సినిమా కేవలం హిందీలోనే విడుదల చేస్తారా? తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా విద్యుత్‌ జమ్వాల్‌ ఇందులో ఐబీ ఏజెంట్‌గా నటించారు. అనుపమ్‌ ఖేర్‌ మరో కీలక పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..