Veeran: తెలుగులోకి రానున్న మరో తమిళ్ సూపర్ హిట్.. ‘వీరన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇప్పుడు మరో హిట్ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. కోలీవుడ్ హిప్ హాప్ సింగర్ ఆది ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరన్. జూన్ 2న తమిళనాడులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.

Veeran: తెలుగులోకి రానున్న మరో తమిళ్ సూపర్ హిట్.. 'వీరన్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Veeran
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2023 | 6:02 PM

గత కొన్ని నెలలుగా తమిళ్, మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కాంతారా, జయ జయ జయహే, మట్టికుస్తీ, రొమాంచమ్ సినిమాలకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో హిట్ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. కోలీవుడ్ హిప్ హాప్ సింగర్ ఆది ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరన్. జూన్ 2న తమిళనాడులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో కేవలం తమిళంలోనే విడుదల కాగా.. ఇప్పుడు ఓటీటీలో తమిళంతోపాటు.. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథ విషయానికొస్తే.. కుమారన్ అనే 15 ఏళ్ల బాలుడు కోయంబత్తూరులోని వీరనార్ అనే గ్రామంలో నివసిస్తుంటాడు. ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారన్ మెరుపుదాడికి గురై స్పృహ కోల్పోతాడు. ఆ షాక్ నుంచి బయటపడిన తర్వాత అతనికి కొన్ని శక్తులు వస్తాయి. ఇక ఇదే విషయాన్ని గ్రహించిన కుమారన్ ఆ శక్తులతో ఏం చేశాడు ?.. వాటిని ఏయే పనులకు వినియోగించాడు ? అనేది సినిమా.

ఆది ప్రధాన పాత్రలో నటించిన వీరన్ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. ఇందులో వినయ్ రాయ్, అతిరారాజ్, మున్షికాంత్, కాలా వెంకట్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.