Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunturu Karam: ‘గుంటూరు కారం’ సినిమాలో మరో హీరోయిన్.. పూజా హెగ్డే ప్లేస్‏లో శ్రీలీల..

ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ పూజా అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమె స్థానంలో సెకండ్ హీరోయిన్‏గా నటిస్తున్న శ్రీలీలను తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.

Gunturu Karam: 'గుంటూరు కారం' సినిమాలో మరో హీరోయిన్.. పూజా హెగ్డే ప్లేస్‏లో శ్రీలీల..
Gunturu Karam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2023 | 3:18 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుంటూరు కారం. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ మరే మూవీపై రావట్లేదు. ముందుగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఔట్ అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ రూమర్స్ పై ట్విట్టర్ వేదికగా ఇచ్చిపడేశాడు తమన్. అలాగే ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే సైతం తప్పుకుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ పూజా అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమె స్థానంలో సెకండ్ హీరోయిన్‏గా నటిస్తున్న శ్రీలీలను తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల నటించనుందని టాక్ నడిచింది. అయితే పూజా స్థానంలోకి శ్రీలీల కాకుండా హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. అలా కాకుండా.. మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని.. సెకండ్ కథానాయికగా మీనాక్షిని తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. తెలుగు తెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించింది మీనాక్షి. ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాఢి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత ఇందులో మహేష్ పుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇన్నాళ్లు బ్రేక్ పడిన షూటింగ్ శనివారం స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!