AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tholiprema: పవన్‌ కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా? 4K టెక్నాలజీలో అదిరిపోయిందిగా..

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినిమా కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ ఉండచ్చు. అయితే తొలి ప్రేమ సినిమా మాత్రం పవన్‌ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. పవర్‌ స్టార్ కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది.

Tholiprema: పవన్‌ కల్యాణ్‌ 'తొలిప్రేమ' రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా? 4K టెక్నాలజీలో అదిరిపోయిందిగా..
Tholi Prema Movie
Basha Shek
|

Updated on: Jun 24, 2023 | 3:01 PM

Share

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినిమా కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ ఉండచ్చు. అయితే తొలి ప్రేమ సినిమా మాత్రం పవన్‌ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. పవర్‌ స్టార్ కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ప్రేమకథా చిత్రాల్లో ఒక ట్రెండ్‌ను క్రియేట్‌ చేసింది. కరుణాకరణ్‌ తెరకెక్కించిన తొలి ప్రేమ సినిమాలో కీర్తి రెడ్డి పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. 1998లో రిలీజైన ఈ ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. సినిమాలోని హృద్యమైన ప్రేమకథ, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక దేవా అందించిన స్వరాలు సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.అలా పవన్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రంగా మిగిలిన తొలిప్రేమ మళ్లీ థియేటర్లలోకి రానుంది. మూవీ రిలీజై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయనున్నారు. 4k టెక్నాలజీతో తొలిప్రేమ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ తొలిప్రేమ సినిమాను భారీగా రిలీజ్‌ చేయనున్నారు. ఈక్రమంలో తొలిప్రేమ రీ రిలీజ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా తొలిప్రేమ 4K రీ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

కాగా ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ నటించిన జల్సా, ఖుషి సినిమాలు రీ రిలీజయ్యాయి. స్ట్రెయిట్‌ సినిమాలకు మించి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు తొలిప్రేమ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉంటున్నారు పవన్‌. ఆయన తర్వాతి సినిమా బ్రో జులై 28న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయ ధరమ్‌ తేజ్‌ ఈ మూవీలో మరో హీరోగా నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు సుజిత్‌ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు పవన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి