Adipurush: ‘వారి ప్రయాత్నాన్ని అభినందించాల్సిందే’.. ఆదిపురుష్ పై చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు..
రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదిపురుష్ పేరుతో రామాయణాన్ని అపహాస్యం చేశారని.. ఈ సినిమా దర్శకుడికి రామాయణంపై కనీస అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రయూనిట్ మొత్తాన్ని 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబెట్టి కాల్చేయాలంటూ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా ఫైర్ అయ్యారు. మరోవైపు తాము తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు వివరణ ఇస్తూనే.. తమను తాము సమర్దించుకుంటున్నారు మేకర్స్.
ఆదిపురుష్.. గత కొద్ది రోజులుగా అనేక వివాదాలు చుట్టుకుంటున్న సినిమా. తానాజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించారు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదిపురుష్ పేరుతో రామాయణాన్ని అపహాస్యం చేశారని.. ఈ సినిమా దర్శకుడికి రామాయణంపై కనీస అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రయూనిట్ మొత్తాన్ని 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబెట్టి కాల్చేయాలంటూ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా ఫైర్ అయ్యారు. మరోవైపు తాము తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు వివరణ ఇస్తూనే.. తమను తాము సమర్దించుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సీఎస్ రంగరాజన్ ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణం ఆదారంగా చేసుకుని చిత్రయూనిట్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే అని అన్నారు.
“రామాయణాన్ని రోజూ పారాయణం చేసేవాళ్లకు.. ఇప్పటికే రామయాణాన్ని సినిమా రూపంలో చూసినవాళ్లకు.. ఆదిపురుష్ సినిమా ఉంటే బాగుండేదని అనిపించడంలో సందేహం లేదు. కానీ సినిమాలో చాలా మార్పులు జరిగాయి. కానీ వారి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఈతరం వాళ్లకు వాల్మీకి రామాయణాన్ని పరిచయం చేయాలి. అందుకోసం పెద్ద స్కేల్లో పరిచయం చేయాలనే ప్రయత్నం ఇది. కానీ ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సింది. రామాయణం ఆధారంగా చేసుకుని మాత్రమే తీశామని మేకర్స్ అంటున్నారు.. అందుకు వాళ్ల సినిమాటిక్ లిబర్టీని ప్రశ్నించలేము. ప్రపంచం మొత్తం 300లకు పైగా రామాయణాలు ఉన్నాయి. ఇండోనేషియాలో కొన్ని వేల సంఖయ్లో రామాయణాలను ప్రదర్శించారు. ఆదిపురుష్ సినిమాను కూడా అలాంటి ఒక రామాయణంగా భావించాలి.
గత వారం రోజులుగా శ్రీరాముడి గురించి జరిగినంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ట్విట్టర్, యూట్యూబ్, టీవీ ఛానళ్లలోనూ ఇలాంటి చర్చ జరగలేదు. ఇదంతా ఈ మూవీ టీమ్ వల్లే సాధ్యమైంది. కాబట్టి వాళ్లను అభినందించాల్సిందే. నచ్చే వాళ్లకు నచ్చుతుంది.. నచ్చని వాళ్లకు నచ్చదు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్” అని అన్నారు.
The power of faith and cinema unite ✨
Adipurush humbly receives the blessings of the Head Priest S Rangarajan from Chilukuri Balaji Temple.
Book your tickets on: https://t.co/4uuTWCUvId#Adipurush now in cinemas near you ✨#JaiShriRam#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/2HAKNRCeje
— People Media Factory (@peoplemediafcy) June 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.