Vijay Thalapathy: అల్లు అర్జున్ పాటకు దళపతి విజయ్ స్టెప్పులు.. చిన్నారులతో అదరగొట్టిన విజయ్..

దళపతి సినిమాల కోసం కేవలం తమిళ్ అడియన్స్ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్టర్ తర్వాత మరోసారి విజయ్, లోకేష్ కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. జూన్ 22న విజయ్ బర్త్ డే సెలబ్రెషన్స్ సైతం గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. దళపతి త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Vijay Thalapathy: అల్లు అర్జున్ పాటకు దళపతి విజయ్ స్టెప్పులు.. చిన్నారులతో అదరగొట్టిన విజయ్..
Vijay Thalapathy
Follow us

|

Updated on: Jun 23, 2023 | 3:20 PM

దళపతి విజయ్… ప్రస్తుతం లియో చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో మరోసారి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. దళపతి సినిమాల కోసం కేవలం తమిళ్ అడియన్స్ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్టర్ తర్వాత మరోసారి విజయ్, లోకేష్ కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. జూన్ 22న విజయ్ బర్త్ డే సెలబ్రెషన్స్ సైతం గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. దళపతి త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా దళపతికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో విజయ్, పూజా హెగ్డే కలిసి చిన్నారులతో డ్యాన్స్ చేస్తున్నారు. గతంలో పూజా, విజయ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బీస్ట్. ఈ మూవీ షూటింగ్ సమయంలో అక్కడున్న పిల్లలతోపాటు.. పూజా, విజయ్ ఇద్దరూ బుట్టబొమ్మ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేశారు. ఈ వీడియోను విజయ్ బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ..దళపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది పూజా. ఈ వీడియోకు విభిన్నంగా స్పందిస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇటీవలే వారసుడు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు విజయ్. మొదటిసారిగా దళపతి నేరుగా తెలుగులో నటించిన సినిమా ఇది. ఇటు తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రష్మిక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న లియో చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.