Actor Suraj: యంగ్ హీరోకు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన కాలు.. తొలగించిన వైద్యులు..
శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. సూరజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ సూరజ్ కాలుపై పడడంతో నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో మోకాలి వరకు కాలు తొలగించారు వైద్యులు.

కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ తనయుడు సూరజ్ ప్రమాదానికి గురయ్యారు. ఊటీకి వెళ్తుండగా.. నంజన్ గూడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్ను లారీ ఢీకొట్టింది. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. సూరజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ సూరజ్ కాలుపై పడడంతో నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో మోకాలి వరకు కాలు తొలగించారు వైద్యులు. ప్రస్తుతం సూరజ్ మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూరజ్ ను చూసేందుకు నటుడు శివరాజ్ కుమార్, నిర్మాత చిన్నెగౌడ మైసుర్ చేరుకుని సూరజ్ కుటుంబాన్ని పరామర్శించారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ సినిమాలో సూరజ్ నటించారు.
కన్నడ సినీపరిశ్రమలోకి సూరజ్ ఇప్పుడిప్పుడే హీరోగా అడుగుపెడుతున్నారు. స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని తన కల అని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పారు సూరజ్. ఇప్పటికే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రంలో నటించిన సూరజ్.. ఇటీవలే మరో రెండు ప్రాజెక్టులను ప్రకటించారు.




చామరాజనగర్లోని గుండ్లుపేట తాలూకా బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సూరజ్ ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య నటుడు శివరాజ్ కుమార్, సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకున్నారు. మరికొన్ని రోజులు ఐసీయూలోనే సూరజ్ కు చికిత్స అందించనున్నారు.




