AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‏తో మూవీ చేయనున్న లియో డైరెక్టర్.. లోకేష్ రియాక్షన్ ఏంటంటే..

విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. చివరగా రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు హీరో సూర్య. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దళపతితో లియో సినిమా చేస్తున్నారు లోకేష్. విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: ప్రభాస్‏తో మూవీ చేయనున్న లియో డైరెక్టర్.. లోకేష్ రియాక్షన్ ఏంటంటే..
Prabhas, Lokesh Kanagaraj
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2023 | 4:42 PM

Share

మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. చివరగా రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు హీరో సూర్య. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దళపతితో లియో సినిమా చేస్తున్నారు లోకేష్. విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ దర్శకత్వంలో ప్రభాస్ రాబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు లోకేష్ కనగరాజ్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ తాను ప్రభాస్ తో చాలా కాలం నుంచే టచ్ లో ఉన్నానని అన్నారు. అలాగే తాను ప్రభాస్ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన కెరీర్ లోనే అతిపెద్ద సినిమా అవుతుందని.. లియో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. మొత్తానికి ప్రభాస్ తో తన నెక్ట్స్ సినిమా కన్ఫామ్స్ చేయడంతో ఖుషి అవుతున్నారు ఫ్యాన్.

ఇదిలా ఉంటే… తాను పది సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు లోకేష్. సినిమాలు చేయాలనే ఆలోచనతో సినీరంగంలోకి అడుగుపెట్టలేదని.. కానీ ఎప్పటికప్పుడు ఓ మంచి సినిమా తెరకెక్కించేందుకే ప్రయత్నించానని అన్నారు. నిర్మాతలు.. నటీనటులు నాపై విశ్వాసం చూపారు.. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకే నేను మూవీస్ చేశాను.. పది సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమవుతానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?