AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraak RP: అనంతపురంలో కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

ఆర్పీకీ ఉన్న ఫేమ్‌తో పాటు మీడియా విపరీతమైన ఫోకస్‌ చేయడంతో అతని వ్యాపారం బాగా సాగింది. లాభాలు కూడా బాగానే వచ్చాయి. దీంతో వెంటనే మణికొండలో రెండో బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాడు. ఆపై నిత్యం విద్యార్థులు, ఉద్యోగులతో కిటకిటలాడే అమీర్‌పేటలో ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ఓపెన్‌ చేశాడు. అంతేకాదు ప్రతి బ్రాంచ్‌ ఓపెనింగ్‌కి ..

Kiraak RP: అనంతపురంలో కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
Kiraak Rp Chepala Pulusu
Basha Shek
|

Updated on: Jun 25, 2023 | 4:48 PM

Share

ప్రముఖ కమెడియన్‌, జబర్దస్త్ ఫేమ్ కిర్రాక్‌ ఆర్పీ ఫుడ్ బిజినెస్‌ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో రెస్టారెంట్లు ఓపెన్‌ చేశాడు. కూకట్‌ పల్లిలో మొదటి బ్రాంచ్‌ ఓపెన్‌ చేసిన ఆర్పీ రద్దీ ఎక్కువ కావడంతో కొన్ని రోజుల పాటు మూసేశాడు. అయితే నెల్లూరు నుంచి మరికొంతమంది మనుషులను తీసుకొచ్చి పకడ్బందీగా చేపల పులుసు సెంటర్‌ను ఓపెన్‌ చేశాడు. ఆర్పీకీ ఉన్న ఫేమ్‌తో పాటు మీడియా విపరీతమైన ఫోకస్‌ చేయడంతో అతని వ్యాపారం బాగా సాగింది. లాభాలు కూడా బాగానే వచ్చాయి. దీంతో వెంటనే మణికొండలో రెండో బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాడు. ఆపై నిత్యం విద్యార్థులు, ఉద్యోగులతో కిటకిటలాడే అమీర్‌పేటలో ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ఓపెన్‌ చేశాడు. అంతేకాదు ప్రతి బ్రాంచ్‌ ఓపెనింగ్‌కి ఏదో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి తన ఫుడ్‌ బిజినెస్‌కు మంచిగా ప్రమోట్‌ చేసుకున్నాడు. తాజాగా ఏపీకి వెళ్లిపోయాడు ఆర్పీ. అనంతపురంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నాలుగో బ్రాంచ్‌ను ఓపెన్‌ చేశాడు.

ఎంత రుచిగా ఉంటే మాత్రం..

ఓపెనింగ్‌ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ యువనేత, శాఫ్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. రిబ్బన్‌ కట్‌ చేసి చేపల పులుసు సెంటర్‌ను ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్‌ వినిపిస్తోంది. కేజీ కొరమీను పులుసు ఏకంగా రూ.1800, ఉండగా, బొమ్మిడాయిల పులుసు కూడా అదే ధర ఉంటోంది.ఇక రవ్వ చేపలు, సన్న చేపలు, పప్పు చారు ఉప్పు చాప వంటి వెరైటీలు టేస్ట్‌ చేయాలంటే కూడా 1200 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఎంత రుచిగా ఉన్నా ఇంతలా రేట్లు భరించలేమని జనాలు అంటున్నారు. మరి ఆర్పీఈ రేట్లను తగ్గిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు