AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్.. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్..

మహేష్ బాబు.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్లోబల్ అడ్వెంచర్‏గా ఈ సినిమాను రూపొందిస్తామని గతంలో జక్కన్న చెప్పడంతో మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఈ సినిమా అప్డే్ట్స్ కోసం సినీప్రియులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్.. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్..
Ssmb29
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2023 | 2:32 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం మళ్లీ పట్టాలెక్కింది. కొన్ని రోజులుగా ఆగిన ఈ సినిమా షూటింగ్ శనివారం పట్టాలెక్కింది. మాస్ యాక్షన్ డ్రామా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తుండగా..హీరోయిన్ పూజా హెగ్డే స్తానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత 988823. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్లోబల్ అడ్వెంచర్‏గా ఈ సినిమాను రూపొందిస్తామని గతంలో జక్కన్న చెప్పడంతో మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఈ సినిమా అప్డే్ట్స్ కోసం సినీప్రియులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రైటర్ విజయేంద్రప్రసాద్ ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన విజయేంద్రప్రసాద్ SSMB29 సినిమా విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను జూలైలోపు పూర్తి చేసి రాజమౌళికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కూడా ఉందని.. అందుకు పతాక సన్నివేశాల్ని అలా మలిచినట్లు తెలిపారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా సాహసాలతో కూడిన ఓ యాక్షన్ డ్రామాగా ఉండనుందని తెలిపారు. దీంతో మహేష్, రాజమౌళి కాంబోపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు.. వీరిద్దరి కాంబోలో ఒకటి కాదు.. రెండు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలియడంతో ప్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక మరోవైపు ఆర్ఆర్ఆర్ వంటి సంచలనం తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే నటించాల్సి ఉండగా.. అనుహ్యంగా ఆమె తప్పుకుందని.. దీంతో ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us