AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి పిల్లలను చూశారా? అప్పుడే తండ్రి బాటలో.. ఏ సినిమాల్లో నటించారంటే?

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుట్టింది తమిళనాడులోనే అయినా ఈ వర్సటైల్‌ యాక్టర్‌కు పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. అందుకే ఈ మధ్యన దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు.

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి పిల్లలను చూశారా? అప్పుడే తండ్రి బాటలో.. ఏ సినిమాల్లో నటించారంటే?
Vijay Sethupathi
Basha Shek
|

Updated on: Jun 25, 2023 | 9:15 PM

Share

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుట్టింది తమిళనాడులోనే అయినా ఈ వర్సటైల్‌ యాక్టర్‌కు పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. అందుకే ఈ మధ్యన దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ సేతుపతికి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారణంగానే ఉప్పెన లాంటి స్ట్రెయిట్‌ సినిమాల్లో నటిస్తున్నారు మక్కల్‌ సెల్వన్‌. కాగా కెరీర్‌ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన చిన్న చిన్న రోల్స్‌లో నటించాడు విజయ్‌. ఆతర్వాత తనను తాను నిరూపించుకుని స్టార్‌ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సేతుపతి ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. విజయ్‌ సేతుపతి సినిమాల్లోకి రాక ముందు దుబాయ్‌లో పనిచేశారట. అక్కడే జెస్సీ అనే అమ్మాయితో లవ్‌లో పడ్డారట.

ఆ తర్వాత ఇండియాకు వెచ్చి విజయ్‌, జెస్సీ పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరి వివాహం జరిగింది. విజయ్‌, జెస్సీల దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు సూర్య కాగా,. కూతురు పేరు శ్రీజ. అన్నట్లు వీరు ఇప్పటికే తండ్రి బాటలో నడుస్తున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సేతుపతి హీరోగా నటించిన నాను రౌడీ దా (తెలుగులో నేనూ రౌడీనే) సినిమాతో కుమారుడు సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇందులో విజయ్‌ చిన్నప్పటి పాత్రను సూర్య చేశాడు. ఆ తర్వాత సేతుపతి నటించిన సింధుబాద్‌, విడుదలై సినిమాల్లోనూ నటించాడు సూర్య. అలాగే ఓ తమిళ్ వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించాడు. ఇక విజయ్‌ కుమార్తె విషయానికి వస్తే.. ముగిల్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీజ. మొత్తానికి తండ్రి వారసత్వాన్నికొనసాగిస్తూ ఇప్పటికే ఇండస్ట్రీలో ఓనమాలు నేర్చుకుంటున్నారు శ్రీజ, సూర్య.

ఇవి కూడా చదవండి
Vijay Sethupathi Family

Vijay Sethupathi Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.