Akira Nandan: అకీరా నందన్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
అకీరా హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసే పనిలో ఉన్న అకీరా నందన్ హీరో మెటీరియల్ గా మారుతున్నాడు. అటు నటనలోనూ.. మర్షలర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ టాప్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆయన సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లోనూ రాణిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలోనే ఆయన వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అకీరా హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసే పనిలో ఉన్న అకీరా నందన్ హీరో మెటీరియల్ గా మారుతున్నాడు. అటు నటనలోనూ.. మర్షలర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో కసరత్తులు చేస్తూ బాడీ డౌలప్ చేస్తున్నాడు. ఇక అకీరా కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అకీరా నందన్ జిమ్ చేస్తోన్న వీడియోను షేర్ చేశారు రేణు. అకీరా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటే బ్యాగ్రౌండ్ లో తెలుగు సాంగ్స్ ప్లే అవుతున్నాయి. దీని పై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్ రాసుకొచ్చారు.
నేను జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో ఇంగ్లిష్ సాంగ్స్ ప్లే చేసేవారు. కానీ నేను హిందీలో సాంగ్స్ ప్లే చేయమంటే నన్ను ఓ చదువురాని దానిలా చూసే వారు కానీ నేను అవి పట్టించుకునే దాన్ని కాదు అని తెలిపింది. నేను అకీరాకు కూడా అదే చెప్పే దాన్ని నీ మాతృభాషలో పాటలు వినమని చెప్పేదాన్ని.. ఇప్పుడు అకీరా ఇలా తెలుగు, హిందీ సాంగ్స్ వింటుండటం చాలా సంతోషంగా ఉంది అని రాసుకొచ్చారు రేణు దేశాయ్.
View this post on Instagram