AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ అత్యంత ఆనందకరమైన క్షణాలివే’.. డెలివరీకి వెళ్లేముందు ముందు ఉపాసన, రామ్ చరణ్‌ల రియాక్షన్‌ చూశారా?

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా గుర్తింపు పొందిన రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ఈనెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబం, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

' అత్యంత ఆనందకరమైన క్షణాలివే'.. డెలివరీకి వెళ్లేముందు ముందు ఉపాసన, రామ్ చరణ్‌ల రియాక్షన్‌ చూశారా?
Ram Charan, Upasana
Basha Shek
|

Updated on: Jun 25, 2023 | 6:29 PM

Share

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా గుర్తింపు పొందిన రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ఈనెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబం, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం పలుకుతూ సినీ ప్రముఖులు, అభిమానులు నెట్టింట పోస్టులతో హోరెత్తించారు. కాగా ప్రసవానికి ఒక రోజు ముందే అపోలో ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యింది ఉపాసన. భర్త రామ్‌చరణ్‌తో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. ఈక్రమంలో డెలివరీ కోసం వీల్‌చైర్‌పై వెళుతున్న వీడియోను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది ఉపాసన. ‘ ఐదు రోజుల క్రితం నా జీవితంలో చోటు చేసుకున్న అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చిన ఉప్సీ ఆస్పత్రిలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. ఇక వీడియో చివరలో రామ్‌ చరణ్‌ను కూడా మనం చూడవచ్చు.

మెగా ప్రిన్సెస్‌ రాకముందు.. ఉపాసన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు చెర్రీ- ఉపాసన దంపతులకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇక తన పాపను ఎత్తుకున్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది ఉపాసన. ఇందులో చరణ్‌ తన పెంపుడు కుక్క పిల్లను చేతుల్లోకి తీసుకుని కనిపించాడు. ‘మా ఇంటి మహాలక్ష్మికి లభించిన ఘన స్వాగతం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. మాపై ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కురిపించిన వారందరికీ ధన్యవాదాలు ‘ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది ఉపాసన. ఈ ఫొటో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.