Tollywood: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు సౌత్ ఇండియా..
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు బ్యూటీలను గుర్తుపట్టారా ?.. ఇద్దరికి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్. కన్నడ సినీపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ తారలు ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసిన ముద్దుగుమ్మలు..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ హావా నడుస్తోంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కేవలం దక్షిణాదిలోనే కాకుండా.. నార్త్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు. మరోవైపు కొత్త కథానాయికల సందడి మొదలైంది. తమిళం, కన్నడ, మలయాళీ ఇండస్ట్రీలకు చెందిన ముద్దుగుమ్మలు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అందులో ఓ ముద్దుగుమ్మ పైన ఫోటోలో కనిపిస్తుంది. అలాగే తనతోపాటు.. పాన్ ఇండియా హీరోయిన్ కూడా ఉంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు బ్యూటీలను గుర్తుపట్టారా ?.. ఇద్దరికి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్. కన్నడ సినీపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ తారలు ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసిన ముద్దుగుమ్మలు.. వారే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అలాగే అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్.
రష్మిక మందన్నా.. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. గీతా గోవిందం మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. అంతేకాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుంది రష్మిక. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది.




ఇక ఆషికా విషయానికి వస్తే.. క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ లీడర్, రాజు కన్నడ మీడియం, రాంబో 2 చిత్రాల్లో నటించింది. ఇక ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆషికాకు మంచి మార్కులే వచ్చాయి. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఆషిక. వీరిద్దరూ ఒకే ఏడాది సినీప్రయాణం ప్రారంభించారు. ఆ సమయం నుంచే వీరిద్దరి స్నేహం కొనసాగుతుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




