Kamal Haasan:’ప్రాజెక్ట్ కె’ కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈమూవీలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ జాయిన్ అయ్యారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈమూవీలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో కమల్ కీలకపాత్రలో నటిస్తున్నారని ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలియజేసింది చిత్రయూనిట్. ఇందులో కమల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రాజెక్ట్ కె సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మొత్తం భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్ట్మాతకంగా నాగ్ అశ్విన్ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫిల్మ్ లవర్స్.
అయితే ప్రాజెక్ట్ కె కోసం కమల్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చర్చ మొదలైంది. ఈ సినిమాలో కమల్ విలన్ పాత్రలో నటించనున్నారని.. అందుకు దాదాపు 20 రోజుల డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. ఇక అందుకు తగినట్టుగానే నాగ్ అశ్విన్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం కమల్ హాసన్ కు దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియరాలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.




ఓవైపు ప్రాజెక్ కె చిత్రంలో నటిస్తున్న కమల్.. మరోవైపు.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ సినిమా చేయనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు.




