Ram Charan: గ్లోబల్ స్టార్ అంటే ఆ రేంజ్లో ఉంటది మరి.. చెర్రీ చేతికి ‘రిచర్డ్ మిల్లే’ వాచ్.. ధరేంతో తెలుసా..
శుక్రవారం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసన ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక అనంతరం అక్కడే మీడియాతో ముచ్చటించారు రామ్ చరణ్. అయితే ఆ సమయంలో చరణ్ స్టైలీష్ లుక్.. డ్రెస్సింగ్ అందరిని ఆకర్షించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో జూన్ 20న మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. లిటిల్ మెగా ప్రిన్సెస్కు స్వాగతమంటూ ఆసుపత్రి బయట మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రెషన్స్ సైతం జరిపారు. శుక్రవారం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసన ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక అనంతరం అక్కడే మీడియాతో ముచ్చటించారు రామ్ చరణ్. అయితే ఆ సమయంలో చరణ్ స్టైలీష్ లుక్.. డ్రెస్సింగ్ అందరిని ఆకర్షించింది.
ఉపాసన డిశ్చార్జ్ సమయంలో రామ్ చరణ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్. పారదర్శక డయల్, రబ్బరు పట్టీలను కలిగి ఉంది. ఈ వాచ్ ధర రూ.1.62 కోట్లు అని తెలుస్తోంది. చెర్రీకి వాచేస్ అంటే అమితమైన ఇష్టం. చరణ్ వద్ద ఇప్పటికే రిచర్డ్ మిల్లె, యోహాన్ బ్లేక్, Audemars Piguet, రోలెక్స్, పటేక్ ఫిలిప్, RM 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె, RM029పాటెక్ ఫిలిప్ నాటిలస్ క్రోనోగ్రాఫ్, Audemars Piguet రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ గ్రాండ్ ప్రిక్స్, Audemars Piguet రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ లెబ్రాన్ జేమ్స్ వంటి ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. వీటి ధర లక్షల నుంచి కోట్ల వరకు ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా.. ఖరీదైన కార్లు, సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఉపాసనతో సమయం గడుపుతున్నారు చరణ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.