Bandla Ganesh: బీఆర్‌ఎస్ పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి.. ఈసారి కాంగ్రెస్‌దే అధికారం: బండ్ల గణేష్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సినీ నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆసంతృప్తితో ఉన్నాయని ఆయన విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బండ్ల గణేష్ సంఘీభావం తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సినీ నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆసంతృప్తితో ఉన్నాయని ఆయన విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బండ్ల గణేష్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థేనని ఆయన అన్నారు. పార్టీ గెలుపు కోసం నేతలందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ భవిష్యత్తు కొరకు సీఎల్పీ పార్టీ విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. కర్ణాటక నుండి కాంగ్రెస్ తుఫాన్ మొదలైందని, దేశమంతా ఇది విస్తరిస్తుందని గణేష్ పేర్కొన్నారు. కాగా దీనికి ముందే భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడీ టాలీవుడ్ ప్రొడ్యూసర్. ‘అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
కాగా గతంలో టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలు తీశారు బండ్ల గణేష్. ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు తెగ వైరలయ్యాయి. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌గా మారిపోయారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు @BhattiCLP సంఘీభావం తెలిపిన సినీ నిర్మాత బండ్ల గణేష్ @ganeshbandla@INCTelangana#BhattiVikramarkaMallu #peoplesmarch100days #CongressForTelangana #KCRFailedTelangana #peoplesmarchpadayatra pic.twitter.com/p6DiVMPXvt
— RAMLAXMAN VEERAPURAM (@RamlaxmanR) June 25, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..