Tamannaah Bhatia: అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా.. ఇంతకు అతను ఏం చేశాడంటే
హ్యాపీడేస్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయిన భామల్లో ఈ అమ్మడు ముందు వరసలో ఉంటుంది.
సినిమా తారలకు అభిమానులుండటం కామన్.. కొంతమందికి డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇంకొంతమందికి ఏకంగా భక్తులు కూడా ఉంటారు. ఇక అభిమానుల కోసం ఏదైనా చేస్తూ ఉంటారు హీరోలు. ఇక హీరోయిన్స్ కు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. అలా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంటున్న భామల్లో తమన్నా ఒకరు. హ్యాపీడేస్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయిన భామల్లో ఈ అమ్మడు ముందు వరసలో ఉంటుంది. ఇక ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది ఈ భామ. ఇక ఈ చిన్నది ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు జీ కర్దా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అలాగే ఇప్పుడు లస్ట్ స్టోరీ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇక రెండు సిరీస్ లలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది తమన్నా. ఇదిలా ఉంటే తమన్నాను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ చాలా మంది ఈ అమ్మడిని ఫాలో అవుతూ ఉంటారు.
తాజాగా ఓ అభిమాని చేసిన పనికి తమన్నా ఎమోషనల్ అయ్యింది. ఇంతకు ఆ అభిమాని ఏం చేశాడంటే.. తాజాగా ముంబై విమానాశ్రయంలో తమన్నా ఓ అభిమానిని కలిసింది. తమన్నాను కలిసిన ఆ వ్యక్తి వెంటనే ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఓ బొకే ఇచ్చి తన చేతి పై ఉన్న తమన్నా పచ్చబొట్టును చూపించాడు. దాంతో తమన్నా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. వెంటనే అతడిని కౌగిలించుకొని ఐ లవ్ యు చెప్పింది. ఈ వీడియో పై తమన్నా అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎమోషనల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram