AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: శ్యామ్ చెల్లెల భాద్యత మాది!.. గొప్పమనసు చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

తారక్ అభిమానులను అమితంగా ఇష్టపడుతాడు. ఎప్పుడు అభిమానుల బాగోగులు కోరుకుంటూ ఉంటాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరైన సమయంలో తారక్ అభిమానులను ఉద్దేశించి చెప్పే ఎమోషనల్ వర్డ్స్ ప్రతిఒక్కరిని కదిలిస్తాయి.

Jr NTR:  శ్యామ్ చెల్లెల భాద్యత మాది!.. గొప్పమనసు చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
Ntr
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2023 | 1:36 PM

Share

ఎన్టీఆర్ అంటే ప్రాణమిచ్చే అభిమానులున్న సంగతి తెలిసిందే. తన నటనతో .. డాన్స్ లతో కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు తారక్. అంతే కాదు ఆయన ఏది చేసినా.. అది అభిమానుల కోసమే.. తారక్ ఫ్యాన్స్ ను అమితంగా ఇష్టపడుతాడు. ఎప్పుడు అభిమానుల బాగోగులు కోరుకుంటూ ఉంటాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరైన సమయంలో తారక్ అభిమానులను ఉద్దేశించి చెప్పే ఎమోషనల్ వర్డ్స్ ప్రతిఒక్కరిని కదిలిస్తాయి. ఇక తారక్ అభిమాని ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణించడం తో ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం నిండిపోయారు. ఇక శ్యామ్ మరణం పై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు చెప్తుండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. చనిపోయిన శ్యామ్ చెల్లెలి బాధ్యతను తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరిట ఫ్యాన్స్ నెలకొలిపిన స్వచ్చంద సంస్థ శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత తమదే అంటూ ముందుకు వచ్చింది. శ్యామ్ చెల్లెలి పెళ్లి దగ్గరుండి జరిపిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు RAW NTR అనే పేరుతో ఓ స్వచ్చంద సంస్థను నెలకొలిపారు . ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం అందించారు. ఇప్పుడు శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యతను స్వీకరించారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం..శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం అని తెలిపారు. ఎన్టీఆర్ ఫ్యాన్ పెద్దమనసును దర్శకుడు హరీష్ శంకర్ మెచ్చుకున్నారు.