AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Kaaram Coffee: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘స్వీట్‌ కారం కాఫీ’ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

మణిరత్నం 'రోజా' సినిమాతో ఓవర్‌ నైట్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది మధుబాల. ఆ తర్వాత కూడా తన అందం, అభినయంతో దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్పెషల్‌ రోల్స్‌లో వెండితెరపై సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. మధుబాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్‌ స్వీట్‌ కారం కాఫీ.

Sweet Kaaram Coffee: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'స్వీట్‌ కారం కాఫీ' సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Sweet Kaaram Coffee Web Series
Basha Shek
|

Updated on: Jun 27, 2023 | 1:22 PM

Share

మణిరత్నం ‘రోజా’ సినిమాతో ఓవర్‌ నైట్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది మధుబాల. ఆ తర్వాత కూడా తన అందం, అభినయంతో దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్పెషల్‌ రోల్స్‌లో వెండితెరపై సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. మధుబాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్‌ స్వీట్‌ కారం కాఫీ. అలనాటి అందాల తార లక్ష్మీ మరో కీలక పాత్రలోనటించారు. ఫ్యామిలీ అండ్‌ రోడ్‌ జర్నీ అడ్వెంచెరస్‌ జోనర్‌లో తెరకెక్కిన స్వీట్ కారం కాఫీ సిరీస్ లో శాంతి అనే మరో కొత్త అమ్మాయి నటిస్తోంది. ఇలా మొత్తం మూడు మూడుతరాలకు చెందిన మహిళల కథతో ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ రోడ్‌ జర్నీ సిరీస్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో జులై 6 నుంచి స్వీట్‌ కారం కాఫీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. తమిళ్‌ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులో ఉండనుంది. కాగా స్వీట్‌ కారం కాఫీ సిరీస్‌ను మొత్తం 240 దేశాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ తెలిపింది.

స్వాతి రఘురామన్, కృష్ణ మరిముత్తు, బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన స్వీట్‌ కారం కాఫీ సిరీస్‌ లో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. లయన్ టూత్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రేష్మ ఘటాల ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా రేష్మా ఘటాల మాట్లాడుతూ ‘ స్వీట్‌ కారం కాఫీ అనేది సకుటుంబ సమేతంగా చూడదగ్గ అర్బన్‌ ఫ్యామిలీ డ్రామా. విభేదాలు, ఆప్యాయతలు, నిరుత్సాహాలు , సయోధ్యలతో కూడిన కుటుంబ సభ్యుల మధ్య నిజ జీవిత బంధాలను ఈ సిరీస్‌ ఉదహరిస్తుంది. మూడు వేర్వేరు తరాలకు చెందిన మహిళలతో ప్రయాణంతో కూడిన ఈ సిరీస్‌ ఎంతో వినోధభరితంగా ఉందటుంది. భారతదేశంలోనే కాకుండా 240 దేశాల్లో మా స్వీట్ కారం కాఫీ సిరీస్‌ ను స్ట్రీమింగ్‌ చేయనున్నాం’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..