AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun: హీరో అర్జున్‌ ఇంట పెళ్లి బాజాలు! త్వరలో ఐశ్వర్య గ్రాండ్‌ వెడ్డింగ్‌! వరుడు కూడా నటుడే

యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయా? ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కోలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్‌ కమెడియన్‌తో ఐశ్వర్య వివాహం జరగనుందన్న ప్రచారం కోలీవుడ్‌ సర్కిళ్లలో బాగా వినిపిస్తోంది.

Arjun: హీరో అర్జున్‌ ఇంట పెళ్లి బాజాలు! త్వరలో ఐశ్వర్య గ్రాండ్‌ వెడ్డింగ్‌! వరుడు కూడా నటుడే
Arjun Sarja Family
Basha Shek
|

Updated on: Jun 26, 2023 | 9:57 AM

Share

యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయా? ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కోలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్‌ కమెడియన్‌తో ఐశ్వర్య వివాహం జరగనుందన్న ప్రచారం కోలీవుడ్‌ సర్కిళ్లలో బాగా వినిపిస్తోంది. సీనియర్‌ కమెడియన్‌ తంబిరామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య గత కొంతకాలంగా ప్రేమలో ఉందట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించారట. త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి అత్యంత వేడుకగా జరగనుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనేది వెలువడలేదు. అటు ఉమాపతి ఫ్యామిలీ నుంచి కానీ, అర్జున్‌ కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన వస్తే ఈ పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుంది.

కాగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఐశ్వర్యా అర్జున్‌. 2013లో ‘పట్టతు యానయ్‌’ అనే తమిళ్‌ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత ప్రేమ బరహా అనే కన్నడ సినిమాలో నటించింది. టాలీవుడ్‌లోనూ ఐశ్వర్య సినిమా చేయాల్సింది. తండ్రి దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా షూటింగ్‌ కూడా మొదలెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక ఉమాపతి రామయ్య విషయానికొస్తే.. 2017లో ‘అదగపాతుతు మగజనంగలే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దేవదాస్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..