ఈ కరాటే కిడ్‌ను గుర్తుపట్టారా? ఒకప్పటి టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌.. అమ్మాయిల మనసు దోచేసిన రాజకుమారుడు.. కానీ..

పై ఫొటోలో ఉన్న కరాటే కిడ్‌ను గుర్తుపట్టారా? ఇతను ఒకప్పుడు టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌.. అమ్మాయిల మనసు దోచేసిన రాకుమారుడు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగపెట్టాడు. వరుస విజయాలతో స్టార్‌ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు.

ఈ కరాటే కిడ్‌ను గుర్తుపట్టారా? ఒకప్పటి టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌.. అమ్మాయిల మనసు దోచేసిన రాజకుమారుడు.. కానీ..
Tollywood Hero
Follow us
Basha Shek

|

Updated on: Jun 26, 2023 | 7:47 AM

పై ఫొటోలో ఉన్న కరాటే కిడ్‌ను గుర్తుపట్టారా? ఇతను ఒకప్పుడు టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌.. అమ్మాయిల మనసు దోచేసిన రాకుమారుడు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగపెట్టాడు. వరుస విజయాలతో స్టార్‌ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఒకానొకదశలో టాప్‌ హీరోలకు పోటీగా మారిపోయాడు. అయితే అతనిపై విధి చిన్న చూపు చూసింది. అందలం ఎక్కించినట్టే ఎక్కి కిందకు దించేసింది. వరుసగా సినిమాలు ప్లాఫ్‌ అయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. ఆకాశమంత క్రేజ్‌ను అందుకుని, ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం సహించలేకపోయాడు. అందుకే ఈ ప్రపంచంలో ఉండలేకపోయాడు. ఆత్మహత్య చేసుకుని అందరినీ తీవ్ర విషాదంలో ముంచాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో. యస్‌. అతను మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌. ఇవాళ (జూన్‌ 26) అతని జయంతి.

చిత్రం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్‌ కిరణ్‌. నువ్వునేను సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆతర్వాత మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం, శ్రీరామ్‌ తదితర సినిమాలతో యూత్‌ ఫేవరెట్‌ హీరోగా మారిపోయాడు. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు అతని సినిమా కెరీర్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఔనన్నా కాదన్నా, హోలీ, వియ్యాల వారి కయ్యాలు, గుండె ఝల్లుమంది వంటి సినిమాలు చేసినా హిట్‌ కొట్టలేకపోయాడు. దీంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2014 జనవరి 5న బలవన్మరణానికి పాల్పడ్డాడు ఉదయ్‌. సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న ఉదయ్‌ హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. అయితే ఇప్పటికీ అతని సినిమాల రూపంలో మన మధ్యనే ఉంటున్నాడు ఉదయ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..