The Kerala Story: రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు.. ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలోకి రాకపోవడానికి అసలు కారణమిదే
హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదాశర్మ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. కేరళలో వెలుగు చూసిన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తోసేన్ ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందే వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ థియేటర్లలోకి వచ్చాక రాజకీయ ప్రకంపనలు రేపింది.
హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదాశర్మ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. కేరళలో వెలుగు చూసిన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తోసేన్ ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందే వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ థియేటర్లలోకి వచ్చాక రాజకీయ ప్రకంపనలు రేపింది. కాంట్రవర్సీ అంశాలు ఉండడంతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ మూవీని నిషేధించారు. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం పన్ను మినహాయింపు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనకు సంబంధించి ఘర్షణలు చోటుకున్నాయి. అయితే ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ది కేరళ స్టోరీ. అయితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడపోలేదట. ఓటీటీ బయ్యర్లు ఎవరూ ది కేరళ స్టోరీ సినిమాను కొనేందుకు ఆసక్తి చూపడం లేదని డైరెక్టర్ సుదీప్తోసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ది కేరళ స్టోరీ సినిమాను కొనేందుకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి సరైన ఆఫర్ రాలేదు. ఏదైనా ప్రధాన సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాం. అయితే మాపై కక్ష సాధించేందుకు సినిమా ఇండస్ట్రీలో ఒక గ్యాంగ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడం కొంతమందిని కలవరపాటుకు గురిచేసింది. ఈ కారణంతోనే మాపై కక్ష సాధిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు సుదీప్తోసేన్. కాగా మే 5న థియేటర్లలో రిలీజైంది ది కేరళ స్టోరీ. జూన్ 23 నుంచి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే సుదీప్తోసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..