Hyderabad: డబ్బుల్లేక డాక్టర్ చదువు మానేసింది.. ఆపై మసాజ్ ముసుగులో వ్యభిచారం.. చివరకు పోలీసులకు చిక్కి..
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు రైడ్ చేశారు. స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వహకురాలు శృతితో పాటు 10 మంది యువతులను 18 మంది విటులను అరెస్టు చేశారు
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు రైడ్ చేశారు. స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వహకురాలు శృతితో పాటు 10 మంది యువతులను 18 మంది విటులను అరెస్టు చేశారు. స్పా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఏపీకి చెందిన ఒక అమ్మాయి ఉద్యోగాల పేరుతో యువతులకు ఆశచూపి.. స్పాలో మసాజ్ పేరిట వ్యభి చారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పూణె, ముంబాయి, హైదరాబాద్ కు చెందిన యువతులకు గాలెం వేసినట్లు పోలీసులు తెలిపారు. స్పా నిర్వహకురాలు గతంలో మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లింది. ఫీజు కట్టలేక తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆతర్వాత అమీర్‌పేటలో ఎయిర్ హోస్ట్‌గా శిక్షణ తీసుకుంది. కోవిడ్ కారణంగా ఉద్యోగం రాకపోవడంతో స్టార్ హోటల్లో పని చేసింది. పెద్ద మొత్తంతో డబ్బులు సంపాదించాలనే ఆశతో మోహన్ అనే వ్యక్తి సాయంతో స్పా సెంటర్ పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. కాగా రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ వెళ్లింది సదరు అమ్మాయి. అయితే కోర్సుకు డబ్బుల్లేక వెనక్కి వచ్చేసింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హైదరాబాద్ కు వచ్చి స్పా బిజినెస్ ప్రారంభించింది. అయితే ఇదే ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసుకు పట్టుబడింది.
గతంలోనూ..
కాగా సదరు అమ్మాయి పోలీసులకు పట్టుబడడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఇలాగే వ్యభిచార కూపం నిర్వహిస్తూ పంజాగుట్ట పోలీసులకు దొరికింది. జైలుకు కూడా పంపించారు.అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తిరిగి మళ్లీ అదే వ్యాపారం చేసింది. ఈసారి కూడా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..