Telangana: అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తహతహ.. కేసీఆర్‌ను కాకాపట్టే పనిలో ఉన్నతాధికారులు..!
మాకేం తక్కువ, మేం కూడా అసెంబ్లీలో అడుగుపెడతామ్ అంటున్నారు కొందరు ఉన్నతాధికారులు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో
మాకేం తక్కువ, మేం కూడా అసెంబ్లీలో అడుగుపెడతామ్ అంటున్నారు కొందరు ఉన్నతాధికారులు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇంతకీ, ఆ ఉన్నతాధికారులు ఎవరు?. సిట్టింగ్‌ల సీటుకు ఎసరుపెట్టబోతున్న వాళ్లెవరు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తుంటే, తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. అయితే, ఇప్పుడున్న లీడర్లకు తోడు కొత్తవాళ్లు ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఎలాగైనా ఎన్నికల బరిలోకి దిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఎప్పట్నుంచో గ్రౌండ్ రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఆ లిస్ట్‌లో డీఎంఈ రమేష్‌రెడ్డి, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, టీఎన్‌జీవో నేత రాజేందర్, నిలోఫర్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. వీళ్లతోపాటు మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఎలక్షన్ వార్‌లో తలపడేందుకు రెడీ అవుతున్నారు. అయితే, వీళ్లంతా అధికార బీఆర్ఎస్‌లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అయితే పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో పోటీకి రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది కూడా కేసీఆర్ ఆశీస్సులతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించారు గడల.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పోటీ చేస్తానంటోన్న కొత్తగూడెంలో ప్రస్తుతం వనమా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి, వనమాను కాదని గడలకు టికెట్ ఇస్తుందా? లేదో? తెలియదుగాని, కొత్తగూడెంలో మాత్రం అప్పుడే రాజకీయం కాకరేగుతోది. సీటు కోసం హాట్ ఫైట్ జరుగుతోంది. ఈసారి కూడా తానే పోటీచేస్తానని వనమా అంటుంటే, ఇకచాలు రిటైర్మెంట్ తీసుకోవాలంటున్నారు గడల.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బాటలోనే ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు డీఎంఈ రమేష్‌రెడ్డి, టీఎన్జీవో నేత రాజేందర్, నిలోఫర్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్. ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, ఈ ముగ్గురూ ఏఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు? అక్కడ సిట్టింగ్‌లు ఎవరున్నారు? సీటు వస్తుందా? లేదా? అన్నది మాత్రం డౌటే!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..