Telangana: కిలో బంగారు హారం.. లటుక్కున పట్టేద్దామనుకున్నాడు.. చివరికి, నెత్తి, నోరు కొట్టుకుంటూ..
Kamareddy News: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఇంకా తక్కువ ధరకు వస్తుందంటే.. ఆలస్యం చేయకుండా క్షణాల్లోనే లటక్కున పట్టేసుకోవాలనుకుంటారు.. అలానే ఓ చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి బంపర్ ఆఫర్ వచ్చింది..
Kamareddy News: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఇంకా తక్కువ ధరకు వస్తుందంటే.. ఆలస్యం చేయకుండా క్షణాల్లోనే లటక్కున పట్టేసుకోవాలనుకుంటారు.. అలానే ఓ చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి బంపర్ ఆఫర్ వచ్చింది.. తక్కువ ధరకు బంగారు హారం అనగానే.. మనోడు ఎగిరి గంతేశాడు.. కట్ చేస్తే మూడు లక్షల రూపాయలు మోసపోయాడు.. తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఓ వ్యక్తిని 3 లక్షలు బురిడి కొట్టించిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి స్థానికంగా ఓ బట్టల షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 14వ తారీఖున ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి.. మరో మహిళ ఇద్దరూ ఆనంద్ బట్టల షాపునకు వచ్చారు. వారిద్దరూ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని బట్టలు కొనుక్కొని తమ వద్ద కిలో బంగారు హారం ఉందని తక్కువ ధరకు ఇస్తామని ఆనంద్ తో మాట్లాడారు. ఒరిజినల్.. అని తమకు డబ్బు అర్జెంట్ అంటూ ఆ మహిళ.. మరో వ్యక్తి ఇద్దరూ ఆనంద్ ను నమ్మించారు.
దీంతో వారి మాటలు నమ్మిన ఆనంద్ మూడు లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం బంగారాన్ని పరీక్షించుకోగా ఓరిజినల్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆనంద్ మూడు లక్షలు ముట్టజెప్పాడు. ఈ క్రమంలోనే.. హారాన్ని తిరిగి మరొక చోట పరీక్షించుకో అది నకిలీగా తేలింది. దీంతో ఆందోళనకు గురైన ఆనంద్.. పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..