AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ శరీరంలో అక్కడ నొప్పిగా ఉందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే..!

High Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి బద్ద శత్రువు. ఇది అనేక వ్యాధులకు కారణం. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి వాటికి కారణం అవుతుంది. ఒక వ్యక్తి మరణానికి కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. అయితే, ప్రతి కొలెస్ట్రాల్ చెడ్డదని కాదు,

Health Tips: మీ శరీరంలో అక్కడ నొప్పిగా ఉందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే..!
Health Tips
Shiva Prajapati
|

Updated on: Jun 26, 2023 | 2:21 PM

Share

High Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి బద్ద శత్రువు. ఇది అనేక వ్యాధులకు కారణం. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి వాటికి కారణం అవుతుంది. ఒక వ్యక్తి మరణానికి కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. అయితే, ప్రతి కొలెస్ట్రాల్ చెడ్డదని కాదు, మంచి కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడతాయి. అయితే, చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే మాత్రం తప్పక అప్రమత్తంగా ఉండాలి. అయితే, దీనిని లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి. అలా కాకుండా.. శరీరంలో కొన్ని భాగాలలో నొప్పి ఉండటం కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం.

చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పడానికి సంకేతాలు..

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే.. తొడ, తుంటి, దూడ కండరాలలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. దీని కారణంగా దుస్సంకోచాలు తలెత్తుతాయి. రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడటం వల్ల గుండెకే కాకుండా శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా పాదాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దాంతో ఈ అవయవాలలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా నొప్పి వస్తుంది. ఈ సమస్యను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. తొడ, తుంటి, దూడ కండరాలలో తీవ్రమైన నొప్పి కారణంగా.. నడవడం, సాధారణ శారీరక పనులు చేయలేకపోవడం, మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవడం అవసరం.

పాదాలలో నొప్పి..

కొవ్వు పెరిగితే.. పాదాలు, అరికాళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. పాదాలు తిమ్మిరి వస్తుంది. పాదాలు చల్లగా ఉంటాయి. గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. కాలు వాస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..