Mango Side Effects: మామిడి పండ్లను ఇష్టంగా లాగించేస్తున్నారా? ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే..

మామిడి పండును ఇష్టపడని వారు ఉండరు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్లదే రాజ్యం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. సీజన్ వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తారు. మామిడి షేక్స్, డెజర్ట్‌లు, స్మూతీస్ సహా వివిధ రకాలుగా తీసుకుంటారు.

Mango Side Effects: మామిడి పండ్లను ఇష్టంగా లాగించేస్తున్నారా? ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే..
Mango
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2023 | 1:05 PM

మామిడి పండును ఇష్టపడని వారు ఉండరు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్లదే రాజ్యం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. సీజన్ వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తారు. మామిడి షేక్స్, డెజర్ట్‌లు, స్మూతీస్ సహా వివిధ రకాలుగా తీసుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాలలో పండే ప్రతి మామిడి దాని స్వంత ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. అవి రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైనవి కూడా. మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే, ఈ పండ్లు ఎంత మేలు చేస్తాయో.. దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా మామిడి పండ్లు తినేవారు చేయకూడని 4 సాధారణ తప్పులు ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

జ్యూస్‌లు, షెక్‌లు తగ్గించాలి..

మామిడి పండును నేరుగా తీసుకోవడం వల్లే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. జ్యూస్‌లు, షేక్‌ల వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. జ్యూస్‌లు, షేక్‌లలో షుగర్, పాలు వంటివాటిని కలుపుతారు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

ఉదయాన్నే తినొద్దు..

మామిడి పండ్లను ఉదయానే ఖాళీ కడుపుతో తినొద్దు. ఇలా తినడం వల్ల రోజంతా ఆకలి వేయదు. తద్వారా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

నట్స్‌తో కలిపి తినాలి..

చాలా మంది మామిడి కాయను నేరుగా లాగించేస్తారు. దీనికి బదులుగా నట్స్‌తో కలిపి తినడం వలన మేలు జరుగుతుంది. మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ స్నాక్స్ మాదిరిగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

పరిమితంగా తినాలి..

కొందరు మామిడి పండ్లు ఇష్టంగా తింటారు. ఆ ఇష్టం కొద్ది అధికంగా లాగించేస్తారు. కానీ, మామిడి పండ్లను ఒక రోజులో 100 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఎక్కువగా తినడం వలన శరీరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. అలర్జీలు, విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్