AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కలిపి తీసుకోకూడని ఫుడ్ కాంబినేషన్స్ ఇవే.. తిన్నారంటే గుండె జబ్బుల ఖాయమంటున్న నిపుణులు.. వివరాలివే..

Food Combinations: ఆరోగ్యాన్ని కాపాడడంలో మనం తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇదే ఆహారం మనకు అనేక ఆరోగ్య సమస్యలు కలిగేలా కూడా చేస్తుంది. అవును, సమయానికి ఆహారం తీసుకోకపోయినా, అలాగే పరిమితికి మించి తీసుకున్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే కొన్ని రకాల..

Health Tips: కలిపి తీసుకోకూడని ఫుడ్ కాంబినేషన్స్ ఇవే.. తిన్నారంటే గుండె జబ్బుల ఖాయమంటున్న నిపుణులు.. వివరాలివే..
Food Combinations To Avoid
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 26, 2023 | 3:57 PM

Share

Food Combinations: ఆరోగ్యాన్ని కాపాడడంలో మనం తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇదే ఆహారం మనకు అనేక ఆరోగ్య సమస్యలు కలిగేలా కూడా చేస్తుంది. అవును, సమయానికి ఆహారం తీసుకోకపోయినా, అలాగే పరిమితికి మించి తీసుకున్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకోడం వల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సరిపడని ఫుడ్ కాంబినేషన్‌లు అజీర్తి సమస్యలతో పాటు వాంతులు, వికారం, రక్తపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందట. మరి వైద్య నిపుణుల ప్రకారం ఏయే ఫుడ్ కాంబినేషన్లను దూరంగా పెట్టాలో ఇప్పుడు చూద్దాం..

భోజనంతో పండ్లు: భోజనం చేసే సమయంలో రుచి కోసం చాలా మంది పండ్లను తీసుకుంటారు. అయితే అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్లను చిరుతిండిగా మాత్రమే తీసుకోవాలని, భోజనంతో తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తుందని వారు అంటున్నారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో మైకం సమస్య కూడా కలిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

మాంసంతో జున్ను: కొందరు మాంసంలో రుచి కోసం జున్నును కలుపుకుంటారు. అయితే అలా చేయడం వల్ల ఆహారంలో సోడియం కంటెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు కలిగే ప్రమాదం కూడా అధికమవుతుంది. ఇంకా శరీర ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.

ఇవి కూడా చదవండి

సిట్రస్ పండ్లతో పాలు: నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు అమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో పాటు పాలను కలిపి తీసుకుంటే.. అవి కడుపులో గడ్డగా మారే ప్రమాదం ఉందంట. ఇంకా అజీర్తి సమస్యలు, గ్యాస్ వంటివి కలిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఈ రకమైన ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.

ఐరన్‌, కాల్షియం: మానవ శరీరానికి కావలసిన పోషకాలలో ఐరన్, కాల్షియం ప్రముఖమైనవి. కానీ వీటిని కలిపి తింటే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. వీటిని ఒకేసారి శరీరం గ్రహించలేదు, ఫలితంగా శరీరంలో ఐరన్ లోపం, లేదా కాల్షియం లోపం కలుగవచ్చు. అంటే రానున్న కాలంలో మీకు రక్తహీనత, రక్తపోటుతో పాటు బోలు ఎముకలు కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ ఒకే సారి తీసుకోకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..