AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఎన్నికలకు సిద్ధమవుతోన్న గులాబీ బాస్.. వారం రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన..?

BRS Party-CM KCR: గులాబీ బాస్‌ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాల ఊహకందని రీతిలో.. పక్కా ప్లాన్‌తో.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించిన సీఎం కేసీఆర్..

CM KCR: ఎన్నికలకు సిద్ధమవుతోన్న గులాబీ బాస్.. వారం రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన..?
CM KCR
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 24, 2023 | 9:04 PM

Share

BRS Party-CM KCR: గులాబీ బాస్‌ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాల ఊహకందని రీతిలో.. పక్కా ప్లాన్‌తో.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. అన్నిపార్టీల కంటే ముందుగానే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున.. ముందుగానే అభ్యర్థుల జాబితాను రెడీ చేశారు. వారం, పది రోజుల్లోనే.. మొత్తం అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్‌ సిద్ధమవుతున్నారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రభుత్వ రద్దు ప్రకటనతో పాటే.. అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. అప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందే.. ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది.

అదే తరహాలో.. ఇప్పుడు కూడా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తు చేశారు. వారం, పది రోజుల్లోనే.. అందరు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా వారం, పదిరోజుల్లో.. మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు గులాబీ బాస్‌. ఇంకా ఈ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండానే.. సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేశారు. అలానే.. 80 నుంచి 90 శాతం సిట్టింగ్స్‌కే అవకాశం కల్పిస్తున్నారు. ఇక 8 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్‌ ఉంది. సర్వేల ఆధారంగా గులాబీ బాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక.. గులాబీ బాస్‌ పెద్ద ప్లానే ఉందట..! వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్‌ దక్కుతుందని ఇప్పటికే స్పష్టత నిచ్చారు. చివరి నిమిషంలో టిక్కెట్లు ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం చూపిస్తుంది. ఎన్నికల ముందు.. టికెట్ దక్కని వారు తిరుగుబాటు చేసి రెబల్స్‌గా మారి వేరే పార్టీల్లో చేరిపోవడం, అంతర్గత విబేధాలు లాంటివి సర్వసాధారణమే. అయితే.. ఈసారి ఇలాంటివాటికి చోటివ్వకుండా ఉండేందుకే.. కేసీఆర్.. ముందుగానే వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారట. బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితా సిద్ధంగా ఉందని.. వారిని వీలైనంత వరకూ బుజ్జగించడానికి.. లేకపోతే.. వెళ్లిపోయినా ప్రభావం లేకుండా చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇప్పటికే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్‌ స్పీడ్ పెంచింది. రాష్ట్ర యంత్రాంగంతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే.. వారం పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి తెరలేపాలనే యోచనలో ఉన్నారు కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీఆర్ఎస్ ప్రచారానికి… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సరైన లాంచ్ ప్యాడ్‌గా మారాయి. హ్యాట్రిక్ లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్‌… జూన్ 2న ప్రారంభమైన 21 రోజుల వేడుకల సందర్భంగా ప్రచార పర్వంతో దూసుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మూడు వారాల పాటు నిర్వహించిన కార్యక్రమాలు అధికార పార్టీకి గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను..ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..